సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేస్: రూ.2వేల కోట్ల బెట్టింగ్స్?

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పైన ముంబై సెషన్స్ కోర్టు తీర్పుపై దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరిగినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నాటికి హిట్ అండ్ రన్ కేసులో రెండువేల కోట్ల రూపాయల మేర బెట్టింగ్‌కు పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. కోర్టు తీర్పు వెలువడేలోపు ఇది మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Salman Khan: Bollywood star guilty in hit-and-run case

కాగా, హిట్ అండ్ రనే కేసులో సల్మాన్ ఖాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవ్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది.

ఆ సమయంలో సల్మాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్థర్ రోడ్ జైలుకు ఆయన్ని తరలించే అవకాశం ఉంది. కోర్టు అతనికి ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తుందనేది చర్చనీయాంశం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+