ఇంటర్నెట్ స్టార్ రేణు మోండల్‌కు సల్మాన్ ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా...?
Recommended Video
ముంబై: రేణు మోండల్... ఒక్క రాత్రిలోనే సెలిబ్రిటీగా మారారు. రైల్వే ప్లాట్‌ఫాంపై తన అద్భుతమైన పాట ఒక్కసారిగా వైరల్ అవడంతో ఆమె జీవితమే మారిపోయింది. ఆమె టాలెంట్‌ను గుర్తించిన ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా తన చిత్రంలో పాడే అవకాశం కల్పించారు. దీంతో ఒక్కసారిగా రేణు మోండాల్ సోషల్ మీడియా సెన్సేషనల్‌గా మారారు. ప్లాట్‌ఫాంపై కాలం వెళ్లదీసిన రేణు మోండాల్‌కు ఇప్పుడు సొంతంగా ఇళ్లు కూడా రాబోతోంది. ఈ ఇళ్లును కానుకగా ఇస్తున్నది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రేణు మోండల్‌కు ఓ అద్భుతమైన ఇళ్లు కానుకగా ఇచ్చారు. ఆ ఇంటి విలువ అక్షరాల రూ.55 లక్షలు. అంతేకాదు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న దబాంగ్ సిరీస్‌లోని దబాంగ్ -3 చిత్రంలో రేణు మోండల్ ఒక పాటపాడే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇక ఇప్పటికే అభిమానులను సొంతం చేసుకున్న రేణు మోండల్... సల్లూ భాయ్ చిత్రంలో పాట పాడితే ఆమె రేంజ్ మరో లెవెల్‌కు వెళుతుందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లతా మంగేష్కర్ పాడిన పాట ఏక్ ప్యార్ కా నగమా పాటను పాడి ఇంటర్నెట్ సెన్సేషనల్‌గా మారింది రేణు మోండాల్. పశ్చిమ బెంగాల్‌లోని రానాఘాట్ రైల్వే స్టేషన్‌లో ఈ పాట పాడుతుండగా ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. ఇక సల్మాన్ ఖాన్ విషయానికొస్తే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో కండలవీరుడు ఎప్పుడూ ముందుంటారు. ఇంతకుముందు కూడా సల్లూ భాయ్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. తాజాగా రేణు మోండాల్ ఉండేందుకు మంచి ఇళ్లు బహూకరించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు దబాంగ్ స్టార్.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications