వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ తీర్పుపై వివాదాస్పద ట్వీట్స్: క్షమాపణలు చెప్పిన అభిజిత్‌, ఫరా ఆలీ ఖాన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ఫుట్ పాత్ లు ఉన్నది నిద్రపోయేందుకు కాదని, ఫుట్ పాత్‌లపై ప్రమాదాలు జరిగితే డ్రైవర్లది తప్పెలా అవుతుందని సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు తీర్పు అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సింగర్ అభిజిత్ భట్టాచార్య, జ్యూయలరీ డిజైనర్ ఫరా ఆలీ ఖాన్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ఫిర్యాదు మేరకు కేసు వాదనలు విన్న జిల్లా అదనపు న్యాయమూర్తి రామ చంద్ర మూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు గ్రూపుల మధ్య రెచ్చగొట్టడం, అల్లర్లు కారణమయ్యే లాంటి వ్యాఖ్యలను ప్రచారం చేసినందుకు గాను ఐపీసీ సెక్షన్ 153, 143-ఎ, 504, 506 నేరాల కింది ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్లు చూసి సింగర్ చేసిన "అమర్యాదకరమైన" వ్యాఖ్యలు బాధించి సమీపంలోని ఛత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది ఓజా పేర్కొన్నారు. అసలు సల్మాన్ ఖాన్ హిట్ రన్ కేసు తుది తీర్పు అనంతరం వీరిద్దరూ ఏమని వ్యాఖ్యలు చేశారో చూద్దాం.

సింగర్ అభిజిత్ తన ట్విట్టర్‌లో ‘‘రోడ్లమీద పడుకునేది కుక్కలు తప్ప మనుషులు కాదు... అలా పడుకునే వారు కుక్కచావే చస్తారు. ఇళ్లు లేనంత మాత్రాన రోడ్లమీద పడుకోకూడదు'' అంటూ అభిజిత్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఫుట్ పాత్ ప్రమాద ఘటనలకు మద్యాన్ని కూడా కారణంగా చూపలేమని అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్‌తో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అభిజిత్‌ వ్యాఖ్యలపై కేసు కూడా నమోదు అయింది.

డిజైనర్ ఫరా అలీ ఖాన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వెల్లడించారు. పేదలను నిరాశ్రయులను చేస్తున్నది ప్రభుత్వమేనని, అందుకే వారు ఫుట్ పాత్‌లపై నిద్రిస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్ పాత్‌పై నిరాశ్రయులు పడుకోకుండా ఉంటే వారికి ప్రమాదం తప్పి ఉండేదని అన్నారు. అప్పుడు సల్మాన్ కారు ఎక్కించినా నష్టం వాటిల్లేది కాదని అభిప్రాయపడ్డారు. అందుకే, 'హిట్ అండ్ రన్' కు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

వివాదాస్పద ట్విట్‌ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన అభిజిత్‌

తాను చేసిన వివాదాస్పద ట్వీట్ వ్యాఖ్యలపై సింగర్ అభిజిత్ క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పారు. సల్మాన్‌ ఖాన్‌ దృష్టిలో పడడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ట్వీట్ చేసిన సమయంలో తనను విమర్శించిన సెలబ్రిటీలు, ప్రముఖులపై కూడా మండిపడ్డారు.

క్షమాపణ చెప్పిన ఫరా ఆలీ ఖాన్

సల్మాన్‌ ఖాన్‌ కేసులో తీర్పుపై వివాదాస్పద ట్వీట్ చేసిన డిజైనర్ ఫరా అలీ ఖాన్ శుక్రవారం క్షమాపణలు తెలిపారు. పేదలను నిరాశ్రయులను చేస్తున్నది ప్రభుత్వమేనని, అందుకే వారు ఫుట్ పాత్‌లపై నిద్రిస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్ పాత్‌పై నిరాశ్రయులు పడుకోకుండా ఉంటే వారికి ప్రమాదం తప్పి ఉండేదని అన్నారు. అప్పుడు సల్మాన్ కారు ఎక్కించినా నష్టం వాటిల్లేది కాదని అభిప్రాయపడ్డారు.

అందుకే, 'హిట్ అండ్ రన్' కు ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ట్వీట్లపై ట్విట్టర్లో బాలీవుడ్‌ ప్రముఖులతోపాటుగా సాధారణ పౌరులు సైతం మండి పడ్డారు. దీంతో ఆ వ్యాఖ్యలు చేసినందుకు తాను చింతిస్తున్నానంటూ ఈ రోజు ట్విట్టర్‌‌లో అందరికీ క్షమాపణలు తెలిపారు.

English summary
A district court today ordered that an FIR be registered against Bollywood singer Abhijeet Bhattacharya and jewellery designer Farha Ali Khan for their remarks against people sleeping on roads following conviction of actor Salman Khan in a 2002 hit-and-run case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X