సల్మాన్ ఖాన్ చావు అంతకంటే ఘోరంగా ఉండబోతోంది..!!
Salman Khan: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురైన ఘటన మరో మలుపు తిరిగింది. బాబా సిద్ధిక్ తరువాత ఇప్పుడు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ టార్గెట్ అయ్యారు. ఆయనను హతమార్చుతామంటూ తాజాగా బెదిరింపులు అందాయి.
బాబా సిద్ధిక్ హత్యలో తమ ప్రమేయం ఉన్నట్లుగా ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కర్నాల్ సింగ్, ధరమ్ రాజ్ కశ్యప్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

హంతకులకు సుపారీ ఎవరిచ్చారు? ఆయుధాలు ఎక్కడి నుంచి అందాయి? వాటిని ఎవరు పంపించారు? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నిందని, దీన్ని ఆపాలంటే ఇప్పటికప్పుడు తమకు అయిదు కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని ముంబై ట్రాఫిక్ విభాగం పోలీసులకు వాట్సప్ సమాచారం అందింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే సల్మాన్ హత్య బాబా సిద్ధిక్ కంటే ఘోరంగా ఉంటుందనీ హెచ్చరించారు.
ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని, లారెన్స్ బిష్ణోయ్‌తో శతృత్వానికి అడ్డుకట్ట వేయాలనుకుంటే తాము అడిగిన అయిదు కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలని హెచ్చరించారు. తమకు అందిన ఈ వాట్సప్ సమాచారాన్ని ముంబై ట్రాఫిక్ పోలీస్ అధికారులు.. లా అండ్ ఆర్డర్ విభాగానికి పంపించారు. సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు.

గతంలో సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పైనా కాల్పులు జరిపిన ఉందంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి.
సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు గ్యాంగ్‌స్టర్లు. ఆయనను హత మార్చడమే తన లక్ష్యమంటూ ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించుకున్నాడు కూడా. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులు నేరుగా సల్మాన్ ఖాన్ ఇంటిపైనా కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి. అప్పటి ఘటనలో ప్రాణాపాయం తప్పింది.












Click it and Unblock the Notifications