Chandrayaan-3: చంద్రయాన్-3లో వెళ్లినవారికి నా సెల్యూట్: కాంగ్రెస్ మంత్రి వింత వ్యాఖ్యలు
హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగడంతో.. ప్రగ్యాన్ రోవర్ తన పనిని ప్రారంభించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారతీయులంతా సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు, కొంతరు ప్రముఖులు తమ అవగాహన లేమితో ఇస్రో శాస్త్రవేత్తలపై, చంద్రయాన్-3పై ప్రశంసలు కురిపిస్తూ విమర్శలు గురవుతున్నారు. వారిపై మీమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యూపీ, రాజస్థాన్ మంత్రులు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్స్‌పై ఇప్పుడు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.

చంద్రయాన్-3 విజయవంతం అయిన సందర్భంగా రాజస్థాన్ క్రీడల శాఖ మంత్రి అశోక్ చందన్(Ashok Chandan) మీడియాతో మాట్లాడారు. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. అందులో ప్రయాణించిన వారికి సెల్యూట్ చేస్తున్నానంటూ అవగాహనలేమితో మాట్లాడారు.
'చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయినందుకు సంతోషంగా ఉంది. చంద్రయాన్-3లో ప్రయాణించిన వ్యోమగాములకు నా సలాం. సైన్స్ స్పేస్ రీసెర్చ్‌లో ఇండియా మరో అడుగు ముందుకేసింది. మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నా' అంటూ ఈ రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యానించారు.
చంద్రయాన్ 3 ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యోమగాములను జాబిల్లిపైకి పంపిస్తోందని మంత్రి అనుకుంటున్నారు. ఇది మానవ రహిత మిషన్ అనే విషయం కూడా ఆ మంత్రికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏమాత్రం అవగాహన లేకుండా సాధారణంగా నోటికి వచ్చింది మీడియాతో మాట్లాడేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో మంత్రి అశోక్ చందన్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
Gems of Congress 🙏🏻
— Shirish Thorat (@shirishthorat) August 23, 2023
"I salute the passengers who went in Chandrayaan"
Ashok Chandna, Sports Minister, Government of Rajasthan pic.twitter.com/0WXHqtjxAL
మరోవైపు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కూడా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. చంద్రుడిపై కాలుమోపిన భారతీయుడు రాకేశ్ శర్మ అనడానికి బదులు ఆమె పొరపాటున రాకేష్ రోషన్ పేరును ప్రస్తావించారు.
#RakeshSharma #RakeshRoshan #Chandrayaan3 https://t.co/e1lBK2OF5S pic.twitter.com/pgZeh1omMA
— sure (@jusliktht) August 23, 2023
'రాకేశ్ రోషన్ చంద్రుడిపై కాలు మోపినప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ అక్కడి నుంచి చూడ్డానికి భూమి ఎలా ఉంది' అని అడిగారు అని మమతా బెనర్జీ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దానిపై మీమ్స్ చేస్తూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications