Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రాండ్ గా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు, కోట్లాది మంది అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంట్రీ

అప్పు పుట్టిన రోజు సందర్బంగా కర్ణాటకలోని అన్ని నగరాలు. పట్టణాలు నిర్వహిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

బెంగళూరు: స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ (power star) పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (puneeth rajkumar) ఈ భూమి మీద లేకుండా జరగుతున్న రెండో పుట్టిన రోజును ఆయన అభిమానులు ఎంతో బాధతో జరుపుకుంటున్నారు. పవర్ స్టార్ కు మరణం లేదని, ఆయన మా గుండెల్లో పదిలంగా ఉన్నారని పునీత్ రాజ్ కుమార్ అభిమానులు అంటున్నారు. కన్నడిగులు అప్పు పుట్టిన రోజు సందర్బంగా కర్ణాటకలోని అన్ని నగరాలు. పట్టణాలు, గ్రామాల్లో పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు వేడుకులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.

రాజ్ కుమార్ కుమారుడు

రాజ్ కుమార్ కుమారుడు

కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడిగా పునీత్ రాజ్ కుమార్ స్యాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ తో అనేక సినిమాల్లో నటించిన పునీత్ రాజ్ కుమార్ అప్పు సినిమాతో కన్నడ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరువాత పునీత్ రాజ్ కుమార్ స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ గా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్ కుమార్ కుమారుడిగా కాకుండా పునీత్ రాజ్ కుమార్ రాజకుమారుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

పోటీపడిన నిర్మాతలు

పోటీపడిన నిర్మాతలు

సొంత అన్న, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ కు భిన్నంగా నటుడిగా పునీత్ రాజ్ కుమార్ మంచి పేరు, అభిమానులను సంపాధించుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ అంటే ఓ బ్రాండ్ అనే గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ ఆయనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలకు లాభాల పంటలు పండించారు. పునీత్ రాజ్ కుమార్ తో సినిమా తీస్తే ఎవ్వరూ నఫ్టపోరని స్పష్టం కావడంతో ఆయనతో సినిమాలో నిర్మించడానికి గతంలో పలువురు నిర్మాతలు పోటీపడ్డారు.

ఒక్కసారిగా వెళ్లిపోయిన అప్పు

ఒక్కసారిగా వెళ్లిపోయిన అప్పు

కోట్టాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2012 అక్టోబర్ 29వ తేదీన బెంగళూరులో జిమ్ చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే పునీత్ రాజ్ కుమార్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స విఫలమై కొన్ని గంటల్లోనే పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయారు.

అన్నదానాలు, రక్తదానాలు

అన్నదానాలు, రక్తదానాలు

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేకుండా జరుగుతున్న రెండో పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. బెంగళూరు సిటీతో పాటు నలు నగరాల్లో, పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుంచి పునీత్ రాజ్ కుమార్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలు, పేదలకు దుస్తులు పంపిణి, రక్తదానాలు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, పాలు పంపిణి ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, యంగ్ టైగర్ ఎన్టీర్ (NTR) కు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునీత్ రాజ్ కుమార్ కోసం జూనియర్ ఎన్టీర్ (RRR) కన్నడలో ఓ పాట కూడాపాడారు. పునీత్ రాజ్ కుమార్, జూనియర్ ఎన్టీర్ మంచి స్నేహితులు. కర్ణాటకలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమనులు సైతం శుక్రవారం పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్బంగా అన్నదానాలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+