వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సందీప్ వెడ్స్ కార్తీక్: ఏకమైన భారతీయ అమెరికన్ గేలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: దీర్ఘకాలంగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే ఇక్కడ వివాహం చేసుకున్నది యువతి, యువకుడు కాదు, ఇద్దరు యువకులే.

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లయిన కార్తీక్, సందీప్‌లు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలై న సందీప్‌కు అమెరికాలో పుట్టిన కార్తీక్‌తో 2012లో ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయమైంది. ఆ పరిచయమే కొంత కాలానికి ప్రేమగా మారింది. దీంతో వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు. 2013లో తమ తల్లిదండ్రులకు సంగతి చెప్పి అనుమతి కోరారు. తల్లిదండ్రులు తొలుత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే ఆ తర్వాత విశాల హృదయంతో ఒప్పేసుకున్నారు. ఇంకేముంది ఇద్దరబ్బాయిలు ఎగిరి గంతేశారు. ఈ ఏడాది జనవరి 18న శుభముహూర్తంలో కాలిఫోర్నియాలో పెళ్లి పీఠలెక్కారు. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా, బంధుమిత్రులు అక్షింతలు చల్లుతుండగా కార్తీక్.. సందీప్ మెడలో తాళి కట్టాడు. తర్వాత అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు నడిచారు.

వరుడు తన అర్ధాంగుడి చేయిపట్టుకుని అరుంధతీ నక్షత్రం చూపించాడు. ఆహూతులు కొత్త జంటకు కానుకలు సమర్పించి ఆశీర్వదించారు. కాగా, ఈ వివాహ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ హల్‌చల్ చేస్తున్నాయి.

సందీప్ వెడ్స్ కార్తీక్

సందీప్ వెడ్స్ కార్తీక్

ఏడాదిగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే ఇక్కడ వివాహం చేసుకున్నది యువతి, యువకుడు కాదు, ఇద్దరు యువకులే.

సందీప్ వెడ్స్ కార్తీక్

సందీప్ వెడ్స్ కార్తీక్

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లయిన కార్తీక్, సందీప్‌లు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

సందీప్ వెడ్స్ కార్తీక్

సందీప్ వెడ్స్ కార్తీక్

వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలై న సందీప్‌కు అమెరికాలో పుట్టిన కార్తీక్‌తో 2012లో ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయమైంది.

సందీప్ వెడ్స్ కార్తీక్

సందీప్ వెడ్స్ కార్తీక్

ఆ పరిచయమే కొంత కాలానికి ప్రేమగా మారింది. దీంతో వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు.

సందీప్ వెడ్స్ కార్తీక్

సందీప్ వెడ్స్ కార్తీక్

2013లో తమ తల్లిదండ్రులకు సంగతి చెప్పి అనుమతి కోరారు. తల్లిదండ్రులు తొలుత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

సందీప్ వెడ్స్ కార్తీక్

సందీప్ వెడ్స్ కార్తీక్

అయితే ఆ తర్వాత విశాల హృదయంతో ఒప్పేసుకున్నారు. ఇంకేముంది ఇద్దరబ్బాయిలు ఎగిరి గంతేశారు. కుటుంబసభ్యుల సమక్షంలో నిరుడు ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు.

సందీప్ వెడ్స్ కార్తీక్

సందీప్ వెడ్స్ కార్తీక్

తర్వాత పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టారు. బంధుమిత్రులకు వారి వారి ఇళ్లకు వెళ్లి తమ వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికలు అందించారు. ఈ ఏడాది జనవరి 18న శుభముహూర్తంలో కాలిఫోర్నియాలో పెళ్లి పీఠలెక్కారు.

English summary
An unexpected manifestation of that has to be this particular ultra-tradtional Indian marriage, complete with six yard gold bordered silk sarees, grandmothers, pandits and prayers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X