మేము రోడ్ల మీదకు వస్తే సమస్య తీరుపోతుందా ?, ఫేమస్ హీరో సంచలన వ్యాఖ్యలు !
బెంగళూరు/చెన్నై: కావేరి (cauvery)సమస్యపై వివిధ సంస్థలు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి, కావేరి మనుగడకోసం పోరాటంలో చలనచిత్ర వాణిజ్య మండలి (sandlewood) కూడా చేరింది. కావేరి జలాల వివాదంపై ప్రముఖ నటుడు, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ (shivraj kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి (sandlewood)ఆధ్వర్యంలో జరిన ధర్నా కార్యక్రమంలో శివరాజ్ కుమార్ మాట్లాడారు.
కావేరి జలాల పంపిణి అంశంపై కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కలిసి సామరస్యంగా చర్చించాలని శివరాజ్ కుమార్ (shivraj kumar)అన్నారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఈ వివాదం పరిష్కారానికి ముందుకు రావాలి. పరిస్థితిని మనకు అనుకూలంగా మలుచుకోవాలని డాక్టర్ శివరాజ్ కుమార్ (shivraj kumar) కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వానికి మనవి చేశారు.

కావేరి నీటి పంపిణి (Bengaluru) సమస్య ఇప్పటిది కాదని, మొదటి నుంచి కన్నడిగులు పోరాడుతున్నారని, కావేరీ తల్లి శక్తి లాంటిదని, కావేరి తల్లి అందరికీ అవసరం అని హీరో శివరాజ్ కుమార్ (shivraj kumar) అన్నారు. స్యాండిల్ వుడ్ నటీనటులు కావేరి పోరాటం చెయ్యడానినకి ముందుకురారు అని కొందరు పదేపదే విమర్శలు చేస్తున్నారని హీరో శివరాజ్ కుమార్ (shivraj kumar) విచారం వ్యక్తం చేశారు.
కావేరి పోరాటం కోసం నటీనటులు ముందుకు వచ్చి ఏం చెయ్యాలో మొదట మీరు చెప్పాలని నటీనటుల మీద ఆరోపణలు చేస్తున్న వారిని శివరాజ్ కుమార్ ప్రశ్నించారు. స్యాండిల్ వుడ్ (sandlewood) నటీనటులు రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేస్తే కావేరి నీటి సమస్య పరిష్కారం అవుతుందా చెప్పండి. కావేరి జలాల పంపిణి విషయం మావల్ల పరిష్కారం అవుతుంది అంటే కచ్చితంగా మేము రోడ్ల మీదకు వస్తామని శివరాజ్ కుమార్ (shivraj kumar) అన్నారు.

నటీనటులు రోడ్ల మీదకు వచ్చి మైక్ ల ముందు నిలబడి మాట్లాడితే కావేరి జలాల సమస్య పరిష్కారం అవుతుందా? అలా కాదని, ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కూర్చుని మాట్లాడుకుని చర్చల ద్వారా కావేరి నీటి పంపిణి విషయాన్ని పరిష్కరించుకోవాలని హీరో శివరాజ్ కుమార్ (shivraj kumar) అన్నారు.
ప్రతి ఒక్కరూ రైతులే, ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, ఆర్ టీసీ బస్సులు పగలగొడితే, ప్రైవేటు బస్సులు తగిలితే సమస్య పరిష్కారం కాదని, ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయాని, అలా కాకుండా రెండు రాష్ట్రాల నాయకులు కూర్చుని మాట్లాడుకోవాలని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హీరో శివరాజ్ కుమార్ (shivraj kumar) కర్ణాటక. తమిళనాడు ప్రభుత్వాలకు మనవి చేశారు.
కావేరి జలాల పంపకాల విషయంలో కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు చర్చించుకోవాలని, మనం ఎన్నుకున్న ప్రభుత్వమే ఈ వివాదం పరిష్కారానికి ముందుకు రావాలని శివరాజ్ కుమార్ (shivraj kumar) స్పష్టం చేశారు. కావేరి మన జీవనాడి, రైతుల జీవనాడి, రైతుల బతుకులు బాగుపడితే మనమంతా బాగుపడుతామని శివరాజ్ కుమార్ అన్నారు.

కన్నభూమి, నీటి కోసం పోరాడటానికి స్యాండిల్ వుడ్ కు (sandlewood) చెందిన కళాకారులంతా ఏకతాటిపై నిలబడతారని, మా మద్దతు కర్ణాటక ప్రభుత్వానికి ఉంటుందని, రైతుల ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ మనవి చేశారు. ఇక్కడా సమస్య ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి అని శివరాజ్ కుమార్ (shivraj kumar) అన్నారు.
మీ హృదయంతో ఆలోచించకండి, మీ మనస్సుతో ఆలోచించండి, కన్నడిగులు అన్ని భాషల సినిమాలను చూస్తారని, అందులో ఎలాంటి తప్పు లేదని, అయితే మన మన ప్రజలకు, మన రైతులకు ఇచ్చే గౌరవం విషయంలో మేము రాజీపడమని శివరాజ్ కుమార్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో స్యాండిల్ వుడ్ (sandlewood) కళాకారులను ఎవ్వరూ కించపరిచి మాట్లాడకూడదని, కావేరి జలాల కోసం తాము ఏకతాటిపై ఉన్నామని, ఇక ముందు ఉంటామని హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ (shivraj kumar) అన్నారు.












Click it and Unblock the Notifications