Hero: హైటెక్ వ్యభిచారం, సినిమా హీరో అరెస్టు, వీడు ఎంజాయ్ చెయ్యలా, ఎంజాయ్ చేయిస్తున్నాడు. కింగ్ పిన్ !
బెంగళూరు: సినిమాలో హీరోగా నటించిన యువకుడు అతని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు చెప్పడంతో సినిమా సబ్జెక్ట్ నచ్చలేదని కొన్ని కథలను రిజక్ట్ చేసిన చరిత్ర అతనిది. వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పొలీసులు కొంతకాలం నుంచి కొందరి మీద నిఘా వేశారు. ఇదే సమయంలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఆరు మందిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల మీద పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చెయ్యడం సర్వసాధారణం, అయితే ఈ కేసులో అరెస్టు అయిన వారిలో సినిమా హీరో ఉండటం కలకలం రేపింది. సార్ సినిమాల్లో హీరోగా నటించకుండా ఇతరులకు సినిమా చూపించడానికి రెఢీ అయిపోయి అడ్డంగా బుక్కైపోయాడు.

స్యాండిల్ వుడ్ హీరో అరెస్టు
వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో బెంగళూరు సీసీబీ పొలీసులు కొంతకాలం నుంచి కొందరి మీద నిఘా వేశారు. ఇదే సమయంలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఆరు మందిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఆరు మందిలో స్యాండిల్ వుడ్ హీరో మంజునాథ్ అలియాస్ సంజు అలియాస్ యువ అనే హీరో ఉండటం కలకలం రేపింది.

న్యూరాన్ సినిమా హీరో
శ్యాండిల్ వుడ్‌లో మూడేళ్ల క్రితం విడుదలైన న్యూరాన్ సినిమాలో ప్రధాన పాత్ర (హీరో) పోషించిన మంజునాథ్ అలియాస్ సంజు హైటెక్ వ్యభిచారం చేయిస్తూ ఇప్పుడు అందరి ముందు విలన్‌గా మారాడు. లోకాంటో (locanto apk) అనే మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సినిమా హీరో సంజును బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

మొన్న థ్రిల్లర్ సినిమా..... ఈ రోజు థ్రిల్లింగ్ స్కెచ్
2019లో విడుదలైన స్యాండిల్ వుడ్ సినిమా న్యూరాన్ లో మంజునాథ్ అలియాస్ సంజు హీరోగా నటించాడు. న్యూరాన్ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా. ఆసినిమాలో సంజు అలియాస్ మంజునాథ్ కథానాయకుడిగా నటించాడు. తరువాత సినిమా చాన్స్ లు వచ్చినా బిల్డప్ ఇచ్చిన సంజు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడని గాంధీనగర్ వర్గాలు అంటున్నాయి. సినిమాలు పక్కన పెట్టిన సంజు అమ్మాయిల శరీరంతో వ్యాపారం చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.

అడ్డంగా చిక్కిపోయిన హీరో
లోకాంటో మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా విటులను ఆకర్షించి హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న నిందితులతో పాటు సంజు కూడా ప్రధాన నిందితుడు అని పోలీసు అధికారులు అంటున్నారు. మొబైల్ యాప్, వెబ్ సైట్లలో కొందరు అమ్మాయిల ఫోటోలు పెట్టి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న ముఠాలో హీరో సంజు కూడా ప్రధాన నిందితుడు అని, అందుకే అతన్ని అరెస్టు చేశామని బెంగళూరులోని సుద్దగుంట పాళ్య పోలీసులు తెలిపారు. ఈ దందాలో హీరో సంజు అలియాస్ మంజునాథ్ ప్రమేయం ఉందని, సాక్షాలు చిక్కాయని పోలీసు అధికారులు అంటున్నారు.

హీరోకు ఏం పోయేకాలం వచ్చింది ?
హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహకుల్లో హీరో సంజుకు సంబంధం ఉందని పోలీసులు చెప్పడంతో స్యాండిల్ వుడ్ లోని కొందరు ఉలిక్కిపడ్డారు.
అమ్మాయిల ఫోటోలు పెట్టి వ్యాపారం చేస్తున్న న్యూరాన్ సినిమా హీరో సంజు అరెస్ట్ కావడంతో ఆ సినిమాలో నటించిన సాటి నటీనటులు షాక్ అయ్యారని తెలిసింది. అమ్మాయిల ఫోటోలు అక్రమంగా వాడుతున్నాడన్న ఆరోపణపై లోకేంటో యాప్ వెనుక ఉన్న శ్యాండిల్ వుడ్ హీరో మంజునాథ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. హీరో సంజుకు ఏం పోయేకాలం వచ్చి హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నాడని గాంధీనగర్ లోని కొందరు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు.

విదేశీ అమ్మాయిలతో ?
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి బెంగళూరులో వ్యభిచారం చేస్తున్న ఎనిమిది మంది పింప్‌లను ఇటీవల కెంగేరి, బాదరహళ్లిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో సీసీబీ పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి బెంగళూరు నగరంలోని కెంగేరి డెంటల్ కాలేజీ సమీపంలో అద్దె ఇల్లు తీసుకుని హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న నిందితుల గురించి సీసీబీ పోలీసులకు సమాచారం అందింది. కెంగేరిలోని వినాయకనగర్, బాదరహళ్లి ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన తన్వీర్ మండల్, అక్తర్ మండల్, ఇలాహి, బిస్త్వీ సహా ఎనిమిది మంది పింప్‌లను పోలీసులు అరెస్టు చేసి అందరిని జైలుకు పంపించారు.

ఫుల్ నైట్ కు ఎంతంటే ?
పోలీసులకు పట్టుబడిన నిందితులు కేవలం రూ 2 వేల నుంచి 3 వేల రూపాయలకే వ్యభిచారం చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లు, భారతీయ నగదు లభించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను అక్రమంగా బెంగళూరుకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిసస్తున్నారని పోలీసులు అన్నారు. దేశం విడిచి బెంగళూరు వచ్చిన తరువాత యువతులు బట్టలు, డబ్బు కోసం వేరే గత్యంతరం లేక హైటెక్ వ్యభిచారం వ్యాపారంలోకి దిగారని పోలీసులు అంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications