సీఎం విజయ్ - సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్, వాట్ నెక్స్ట్..!!
తమిళనాడు ముఖ్యమంత్రి విడాకుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటీషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో కొనసాగుతోంది. మనస్పర్థల కారణంగా సంగీత గతంలో కోర్టును ఆశ్రయించగా, భరణం, నీలంకరై నివాసంలో హక్కుల గురించి పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, విజయ్ సీఎం అయిన తరువాత కుటుంబ సభ్యుల జోక్యంతో వీరిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ రోజు ఈ కేసును మూసివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును న్యాయస్థానం ముగించింది. విజయ్ సతీమణి సంగీత తన విడాకుల పిటీషన్ ను వెనక్కు తీసుకున్నారు. కొంత కాలం క్రితం విజయ్ పైన సంగీత కోర్టుకు ఎక్కారు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకుల కు కోరారు. రూ 252 కోట్లు భరణం ఇవ్వాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే విజయ్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఏమైందో ఏమో విజయ్ ముఖ్యమంత్రి కావడంతో మనసు మార్చుకున్న సంగీత.. ఇపుడు తన భర్తపై పెట్టిన విడాకుల కేసులను వాపసు తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపింది. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య సఖ్యత కోసం ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో, ఇద్దరు తిరిగి కలిసి ఉంటారనే ప్రచారమూ సాగింది.

సంగీత పిటీషన్ ఉపసంహరణతో
ఇక, ఇప్పుడు కోర్టులో సంగీత పిటీషన్.. విడాకుల కేసు మూసివేస్తూ న్యాయస్థానం నిర్ణయంతో ఈ ఇద్దరి వ్యవహారంలో తదుపరి అడుగుల పైన ఆసక్తి నెలకొంది. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే కుటుంబ బంధాలను కాపాడుకోవడానికి శోభ స్వయంగా కోడలు సంగీతతో మాట్లాడి, ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను సక్సెస్ ఫుల్‌గా సెటిల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. తల్లి చేసిన ప్రయత్నాల వల్లనే విజయ్ - సంగీత మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సంగీత మళ్లీ ఆయన పక్కన చేరడం పొలిటికల్‌గా విజయ్ కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.



Click it and Unblock the Notifications