భారత్ పై షై హోప్ శివతాండవం

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. భారత్ నిర్దేశించిన 351 పరుగులను అలవోకగా అందుకుంది. చేతిలో అయిదు వికెట్లు, 10 బంతులు మిగిలివుండగానే ఈ భారీ స్కోర్ ను ఛేదించింది. ఈ క్రమంలో కేప్టెన్ షై హోప్ శివతాండవమే ఆడాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. 143 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, 17 ఫోర్లతో 162 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ భారత్ ఈ వన్డే సిరీస్‌ను 2-1తో తన సొంతం చేసుకుంది.

ఇంత భారీ స్కోర్ ను ఛేదించడం వన్డే క్రికెట్ సుదీర్ఘ చరిత్రలోనే వెస్టిండీస్ కు ఇదే మొదటిసారి. షై హోప్ ప్రతాపం ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్- 129, రోహిత్ శర్మ- 92 చిన్నబోయాయి. టీమిండియా బౌలింగ్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిందీ కరేబియన్ టీమ్. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమిస్తూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన హోప్ వన్డే క్రికెట్‌లో తన 21వ సెంచరీని చిరస్మరణీయంగా మలచుకున్నాడు.

Shai Hope carried the bat with his 162 not out as West Indies chased down 352 against India in 3rd ODI

లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఒడిదొడుకులను ఎదుర్కొంది. 41 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. జాన్ క్యాంప్ బెల్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అమీర జంగూతో కలిసి షై హోప్ పరుగుల వేట మొదలుపెట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ భాగస్వామ్యానికి 109 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అమీర్ జంగూ రనౌట్ అయ్యాడు. అయినప్పటికీ.. మరో ఎండ్ లో షై హోప్ క్రీజ్ లో పాతుకుపోయాడు. షెర్ఫానె రూథర్‌ఫర్డ్- 24, కీమో పాల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

రాత్రికి రాత్రి తిప్పి కొట్టిన కేంద్రం: భారత్ లోని పాకిస్తాన్ రాయబారికి సమన్లు సైతం..
రాత్రికి రాత్రి తిప్పి కొట్టిన కేంద్రం: భారత్ లోని పాకిస్తాన్ రాయబారికి సమన్లు సైతం..

కేప్టెన్ ఇచ్చిన స్ఫూర్తితో కీమో పాల్ కూడా భారీ షాట్లు ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొట్టాడు. 35 బంతుల్లో అయిదు ఫోర్లతో 44 పరుగులు చేసి మ్యాచ్ ను వెస్టిండీస్‌ వైపు తిప్పాడు. గాయం కారణంగా కాసేపు మైదానాన్ని వీడిన భారత బౌలర్ గుర్నూర్ బ్రార్, తిరిగి వచ్చిన అనంతరం 41వ ఓవర్లో అత్యంత ప్రమాదకరంగా మారిన కీమో పాల్‌ను అవుట్ చేశాడు. మరోవైపు జ్యువెల్ ఆండ్రూ గాయపడటంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ భారం అంతా షై హోప్‌పైనే పడింది.

పవిత్ర గోదావరి నదీ తీరంలో టీటీడీ భారీ కార్యక్రమం
పవిత్ర గోదావరి నదీ తీరంలో టీటీడీ భారీ కార్యక్రమం

చివరి 5 ఓవర్లలో వెస్టిండీస్ విజయానికి లక్క్ష్యం కష్టంగా మారింది. చివరి అయిదు ఓవర్లల్లో 56 పరుగులు అవసరం అయ్యాయి. భారత బౌలర్లు కట్టడిగా బంతులు వేయడంతో రిక్వైర్డ్ రన్ రేట్ ఓవర్‌కు 11.2 కి చేరుకుంది. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ షై హోప్ మరింత ప్రమాదకరంగా మారాడు. భారత బౌలింగ్ లైనప్ ను ఛిన్నాభిన్నం చేస్తూ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

కుల్ దీప్ యాదవ్ వేసిన 46వ ఓవర్ లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో ఊపు తెచ్చాడు. ఆ తర్వాత హర్‌ప్రీత్ బ్రార్ ఓవర్‌లో వరుస బౌండరీలు కొట్టాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన 48వ ఓవర్ లో ఏకంగా 22 పరుగులు పిండుకోవడంతో భారత్ పరాజయం దాదాపు ఖాయమైపోయింది.

భారత బౌలర్లు మరోసారి విఫలం అయ్యారీ మ్యాచ్ లో. ఈ మ్యాచ్ తో వన్డేల్లో అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 9 ఓవర్లల్లో 82 పరుగులు ఇచ్చుకున్నాడు. గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు తీసుకున్నా భారీగా పరుగులు సమర్పించాడు. కుల్ దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్.. ఇలా బౌలర్లందరూ చేతులెత్తేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+