స్మిత్ కు ఇజ్రాయెల్‌ అత్యున్నత గౌరవం! మోదీతో పాటు స్పెషల్ ఇన్విటేషన్..

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా ఘోరం జరిగింది. ప్రాణాలు తీసేందుకు యత్నించిన ముష్కరుడికి కాక్‌పిట్‌లోనే ఎదురునిలిచి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఒక భారతీయ పైలట్. అతడే కెప్టెన్ స్మిత్ మచ్ఛార్. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్ఛార్‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు. 'నువ్వు కేవలం భారత్‌కే కాదు.. ఇజ్రాయెల్‌కు, మొత్తం ప్రపంచానికే ఒక నిజమైన హీరోవి' అని ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రావాలని, ఈ వేడుకల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దివ్యజ్యోతిని వెలిగించి గౌరవం అందుకోవాలని ఆహ్వానించారు.

నమ్మించి వెనుక నుంచి దెబ్బ కొట్టాడు: భయానక క్షణాలను పంచుకున్న పైలట్

ఈ భయానక దాడి ఎలా మొదలైందో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ గుర్తు చేసుకున్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న మరో వ్యక్తి ప్రార్థన చేసుకుంటానని చెప్పడంతో, అతడికి గౌరవం ఇస్తూ తాను ముందు వైపే చూస్తూ కూర్చున్నానని తెలిపారు. ఆ తర్వాత నాలుగు ఐదు నిమిషాల వ్యవధిలోనే వెనుక నుంచి తన తలపై తీవ్రమైన దెబ్బ పడిందని చెప్పారు. విమానానికి ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని మొదట భావించినప్పటికీ, వరుసగా దెబ్బలు పడుతుండటంతో కాక్‌పిట్‌లో ఉన్న వ్యక్తే తనపై దాడి చేస్తున్నాడని గ్రహించానని అన్నారు.

Netanyahu Invites PM Modi and Hero Indian Pilot Smit Machchhar to Israel Independence Day Celebrations
స్మిత్ ను చూసి గర్వపడుతున్నా, రియల్ హీరో: మోదీతో పాటు పైలట్‌ను ఆకాశానికెత్తిన ట్రంప్!
స్మిత్ ను చూసి గర్వపడుతున్నా, రియల్ హీరో: మోదీతో పాటు పైలట్‌ను ఆకాశానికెత్తిన ట్రంప్!

ఆఖరి శ్వాస వరకు పోరాడాను

శరీరం సహకరించకపోయినా, ఈ దాడి నుంచి తప్పించుకోవాలంటే కాక్‌పిట్ తలుపు తెరిచి బయట ఉన్నవారి సహాయం కోరడమే ఏకైక మార్గమని గ్రహించినట్లు స్మిత్ వివరించారు. మొదటిసారి తలుపు తెరవగానే దాడి చేసిన వ్యక్తి మళ్లీ దాన్ని మూసివేశాడని, 'ఇది నా ఆఖరి పోరాటం.. ఇప్పుడు గానీ తలుపు తెరవకపోతే నేను చనిపోతాను' అని అనుకుని, ఉన్న శక్తినంతా కూడగట్టుకుని కాక్‌పిట్ డోర్‌ను నెట్టివేసినట్లు చెప్పారు. తలుపు తెరుచుకోవడంతో బయట ఉన్నవారు వెంటనే వచ్చి దాడి చేసిన వ్యక్తిని బంధించారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించా: స్మిత్ కు ప్రధాని మోదీ వీడియో కాల్
ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించా: స్మిత్ కు ప్రధాని మోదీ వీడియో కాల్

అద్భుతమైన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు

అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ స్మిత్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు తానెంతో ఆశ్చర్యపరిచాయని ప్రధాని నెతన్యాహు కొనియాడారు. "నువ్వు ఎంతో మంది ప్రాణాలను కాపాడావు. నిన్ను చూసి ప్రపంచం గర్విస్తోంది" అని అన్నారు. సాధారణంగా ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మౌంట్ హెర్జెల్‌ వద్ద జ్యోతి వెలిగించే అవకాశం కేవలం ఆ దేశ పౌరులకే ఇస్తారు. అయితే, ఈసారి విలక్షణమైన పరిస్థితుల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ మచ్ఛార్, ప్రధాని మోదీలను ఈ అత్యున్నత గౌరవానికి ఆహ్వానిస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఇజ్రాయెల్ పబ్లిక్ అడ్వైజరీ కమిటీ, మంత్రివర్గ ఆమోదం ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+