మరో 5 నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా..! తర్వాత ఎవరు..?
శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో 5 నెలల్లో తన ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు ఆలోచిస్తున్నారని బాంబ్ పేల్చారు. సెప్టెంబర్ నెలలోనే ప్రధాని మోదీ రాజీనామా చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆర్ఎస్ఎస్ భవనానికి వచ్చారని.. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు వివరించేందుకే ఆయన అక్కడకు వెళ్లారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

2014 నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోదీ ఎప్పుడు వెళ్లలేదని సంజయ్ రౌత్ తెలిపారు. కానీ ఆయన ఆకస్మికంగా ఈరోజు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తనకు ఉన్న సమాచారం మేరకు.. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటోందని.. ఇక ప్రధాని మోదీ కాలం ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత దేశ ప్రధాని ఎవరో ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని జోస్యం చెప్పారు.
ప్రధాని మోదీ 2014 తర్వాత తొలిసారి మార్చి 30న నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నాయకుల్లో 74 ఏళ్లు పైబడిన వారు ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదని నియమం. ప్రస్తుతం నరేంద్ర మోదీకి 74వ సంవత్సరం నడుస్తోంది. సెప్టెంబర్ 17న మోదీ 75వ పుట్టిన రోజు కాబట్టి.. ఆర్ఎస్ఎస్ ఆయనచేత ప్రధాని పదవికి రాజీనామా చేయించే అవకాశం ఉందని ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. 2029లోనూ మోదీనే ప్రధానమంత్రిగా చూస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications