నకిలీ ఫేస్ బుక్ పెట్టారు: శరత్ కుమార్

చెన్నై: తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ప్రారంభించి తనకు కళంకం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని బహుబాష నటుడు, సమత్తువ కచ్చి నేత, శాసన సభ్యుడు శరత్ కుమార్ మండిపడ్డారు. వెంటనే సోషల్ మీడియా నుండి తన పేరుతో ఉన్న నకిలీ ఫేస్ బుక్ తొలగించాలని డిమాండ్ చేశారు.

నకిలీ ఫేస్ బుక్ విషయంపై శరత్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పేరుతో ఎవరో నకిలి ఫేస్ బుక్ సృష్టించారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురైనానని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తన స్నేహితులు, సన్నిహితులు నకిలీ ఫేస్ బుక్ గురించి తనను సంప్రదించారని అన్నారు.

 Sarath Kumar Complains of Fack Face Book in Chennai

శరీరం దృఢంగా ఉంటేనే మన పనితీరు సక్రమంగా ఉంటుందని, ధూమపానం, మద్యపానం సేవించరాదని, వాటికి బానిసలు కాకూడదని నిత్యం తను అందరికి చెబుతుంటానని గుర్తు చేశారు. అయితే వృత్తిపరంగా తాను ఒక చిత్రంలో నటించిన ఒక ఫోటో సేకరించారని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపించారు.

ఆ ఫోటో వలన తనకు కళంకం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నకిలీ ఫేస్ బుక్ తయారు చేసింది ఎవరైనా సరే వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై చెన్నై నగర పోలీసు కమిషనర్ కు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని శరత్ కుమార్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+