పోయెస్ గార్డెన్ లో జయలలిత ఆత్మ: రాత్రి శభ్దాలు, అరుపులు: శశికళ ఫ్యామిలీ ఔట్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు ఎంతో ఇష్టం అయిన పోయెస్ గార్డెన్ వదిలి వెళ్లడం లేదని, ఆమె ఆత్మ అక్కడక్కడే తిరుగుతోందని ఇప్పుడు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పోయెస్ గార్డెన్ లో జయలలిత ఆత్మ సంచరిస్తోందని, దెయ్యం అయ్యి తిరుగుతున్నారని ఇప్పుడు కొత్తగా ఓ వార్త తెరమీదకు తీసుకు వచ్చారు.

షాక్: జయ సమాధి నుంచి శభ్దాలు: పరుగో పరుగు

అన్నాడీఎంకే వర్గాల సమాచారం మేరకు శశికళ కుటుంబ సభ్యులు, ఆమె అనుచరులు ఇప్పుడు ఈ విషయాన్ని జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాత్రి అయితే చాలు పోయెస్ గార్డెన్ లో పెద్దపెద్ద శభ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని, జయలలిత ఆత్మ ఘోషిస్తోందని, అమ్మ దెయ్యం అయ్యి తిరుగుతున్నారని శశికళ కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారని వెలుగు చూసింది.

జయలలిత తరువాత శశికళ

జయలలిత తరువాత శశికళ

పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో జయలలితతో కలిసి శశికళ అక్కడే ఉన్న విషయం తెలిసిందే. జయలలిత మరణించిన తరువాత శశికళతో పాటు మన్నార్ గుడి మాఫియా సభ్యులు పోయెస్ గార్డెన్ లో మకాం వేశారు. అక్కడి నుంచి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పారు.

శశికళ తరువాత ?

శశికళ తరువాత ?

అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన తరువాత టీటీవీ దినకరన్ పోయెస్ గార్డెన్ లో ఉన్నాడు. పోయెస్ గార్డెన్ లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గదిని దినకరన్ కేటాయించుకున్నాడని సమాచారం. ఇప్పుడు అతను జైలుకు వెళ్లడంతో చిన్నమ్మ బంధువులు పోయెస్ గార్డెన్ కు వచ్చి వెలుతున్నారు.

జయలలిత ఆత్మ కాదు దెయ్యం !

జయలలిత ఆత్మ కాదు దెయ్యం !

జయలలిత ఆత్మ సంచరిస్తోందని ఇన్ని రోజులు పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జయలలిత దెయ్యం అయ్యి తిరుగుతున్నారని శశికళ కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాత్రి అయితే పోయెస్ గార్డెన్ లో పెద్దపెద్ద శభ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు.

ఎవ్వరూ లేరు

ఎవ్వరూ లేరు

శశికళ, టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లిన తరువాత పోయెస్ గార్డెన్ లోని జయలలిత వేదనిలయం బంగ్లాలో ప్రస్తుతం ఎవ్వరూ లేరు. ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి శశికళ కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ఈ సందర్బంలో జయలలిత ఆత్మ సంచరిస్తోందని, దెయ్యం అయ్యి తిరుగుతున్నారని ప్రచారం చేస్తున్నారు.

ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమాస్ సీఈవో ప్లాన్ !

ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమాస్ సీఈవో ప్లాన్ !

శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమాస్ సీఈవో వివేక్ ఇంత కాలం టీటీవీ దినకరన్ కు ఆర్థికంగా అండగా ఉన్నాడు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేసిన కేసులో టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లాడు. ఇప్పుడు వివేక్ పోయెస్ గార్డెలో మకాం వెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

పోయెస్ గార్డెన్ లోకి వివేక్ ?

పోయెస్ గార్డెన్ లోకి వివేక్ ?

టీటీవీ దినకరన్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఐటీ అధికారుల తరువాత టార్గెట్ టీటీవీ సమీప బంధువు వివేక్ అంటూ తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంలోనే వివేక్ పోయెస్ గార్డెన్ కు మకాం మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

అధికారులను బెదిరించడానికే !

అధికారులను బెదిరించడానికే !

ఆదాయపన్ను శాఖ, ఈడీ అధికారులు పోయెస్ గార్డెన్ లోకి ప్రవేశించకుండా చూడాలని శశికళ కుటుంబ సభ్యులు జయలలిత దెయ్యం అయ్యి తిరుగుతున్నారని, ఆమెకు నచ్చని వ్యక్తులు పోయెస్ గార్డెన్ లో అడుగు పెట్టిన వెంటనే పెద్దపెద్ద శభ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు.

జాజ్ సినిమా సీఈవో వివేక్ టార్గెట్ ?

జాజ్ సినిమా సీఈవో వివేక్ టార్గెట్ ?

శశికళ, టీటీవీ దినకరన్ తరువాత ఆదాయ పన్ను శాఖ అధికారుల టార్గెట్ మన్నార్ గుడి ఫ్యామిలీలోని వివేక్ అంటూ తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఇళవరసి కుమారుడు వివేక్ పోయెస్ గార్డెన్ లో మకాం వెయ్యడానికి సిద్దం అయ్యాడు.

చీకటి పడిందంటే అంతే

చీకటి పడిందంటే అంతే

పోయెస్ గార్డెన్ లోని జయలలిత వేదనిలయం బంగ్లాలో చీకటి పడిందంటే జోరుగా శభ్ధాలు వినిపిస్తున్నాయని, అమ్మకు నచ్చని వారు అటు వైపు వెళ్లిన వెంటనే గట్టిగా కేకలు వినిస్తున్నాయని శశికళ కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని తెలిసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK sources said that Sasikala faction spread a rumour on Jayalaithaa's soul turns a Ghost in Poes Bungalow.
Please Wait while comments are loading...