సెంట్రల్ జైల్లో శశికళ చుడిధార్ వేసుకుని, చేతిలో బ్యాగ్ పట్టుకుని హల్ చల్, ఈ వీడియోలో !

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ మహారాణిలాగా ఉన్నారని చెప్పడానికి ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తోంది.

బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ మహారాణిలాగా ఉన్నారని చెప్పడానికి ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తోంది. మంగళవారం ఉదయం నుంచి జైల్లో శశికళ ఉంటున్న గదుల ఫోటోలు హల్ చల్ చేశాయి.

ఇప్పుడు బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ మామూలు దుస్తులు వేసుకుని లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని వెలుగు చూసింది. నిత్యం చీరలో దర్శనం ఇచ్చిన చిన్నమ్మ పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మాత్రం చుడిధార్ (పంజాబి డ్రస్) వేసుకుని తిరుగుతున్నారు.

ఎలా ఉన్నారు ?

ఎలా ఉన్నారు ?

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్షపడిన శశికళకు జైల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని, ఆమెను సాదారణ ఖైదీలాగే చూస్తున్నామని, ఖైదీలు అందరికి ఇచ్చే ఆహారం ఇస్తున్నామని ఇంత కాలం అధికారులు మాయమాటలు చెబుతూ వచ్చారు.

శశికళ వదిన మాత్రం !

శశికళ వదిన మాత్రం !

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలు అందరికి ఓ యూనిఫాం ఉంటుంది. పురుషులకు వేరుగా, మహిళా ఖైదీలకు చీరలు ఇస్తుంటారు. శశికళతో పాటు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె వదిన ఇళవరసి మాత్రం ఖైదీలకు ఇస్తున్న చీరలు కట్టుకుంటున్నారు.

ఫస్ట్ టైం శశికళ చుడిధార్ లో

ఫస్ట్ టైం శశికళ చుడిధార్ లో


బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ చుడిధార్ (పంజాబి డ్రస్) వేసుకుని తిరుగుతున్నారని వెలుగు చూసింది. జయలలిత చుడిధార్ వేసుకుని చేతిలో ఖరీదైన బ్యాగ్ పట్టుకుని వెలుతుంటే వెనుక ఆమె వదిన ఇళవరసి మాత్రం ఖైదీలకు ఇచ్చే చీర కట్టుకుని వెలుతున్న విషయం ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

షాపింగ్ కు వెళ్లారా ?

షాపింగ్ కు వెళ్లారా ?

షాపింగ్ చేసే సమయంలో మనకు ఇచ్చే బ్యాగ్ లు చాల అందంగా ఉంటాయి. అయితే జైల్లో ఉన్న శశికళ షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే బ్యాగ్ చేతిలో పట్టుకుని జైలు లోపలికి వస్తున్న ఓ వీడియో మంగళవారం లీక్ అయ్యింది. శశికళ, ఆమె వదిన ఇళవరసి జైలు బయటకు వెళ్లి షాపింగ్ చేసి మళ్లీ జైలు ఆవరణంలోని వస్తున్నట్లు కపపడుతున్న వీడియో లీక్ అయ్యింది. శశికళ బయట షాపింగ్ చేసి వచ్చారని కొన్ని మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నారు.

శశికళకు మాత్రం ఎలా సాధ్యం !

సెంట్రల్ జైల్లో మరే ఖైదీకి ఇవ్వని వెసులుబాటు కేవలం శశికళకు మాత్రం ఎలా ఇచ్చారు ? అనే ప్రశ్న మొదలైయ్యింది. శశికళ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకుని ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించారా ? మామూలు బట్టలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారా ? బయట నుంచి భోజనం తెప్పిస్తున్నారా ? అనే అనుమానాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+