జయ మేనకోడలు ఎఫెక్ట్: శశికళకు అర్హత లేదు, దీపా పెరవై

తమిళనాడులో అమ్మ అభిమానులు జయలలిత పెరవై సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జయ మేనకోడలు దీపా అభిమానులు జే దీపా పెరవై సంస్థను స్థాపించారు. ఎలాంటి పరిస్థితిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి శ

చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలోని నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఇప్పుడు కార్యకర్తలు ఒకడుగు ముందుకు వేసి మూడు వర్గాలుగా చీలిపోతున్నారు. నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి రాజకీయాలు చెయ్యడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారు.

జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేలో వర్గపోరు ఎక్కువ అయ్యింది. శశికళ సీఎం కాకూడదని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టకూడదని జయ మేనకోడలు దీపా జయకుమార్ బహిరంగంగానే మీడియాకు చెప్పారు.

Sasikala Natarajan is not fit for General Secretary of AIADMK.

శశికళకు ఏమీ అర్హత ఉందని మా మేనత్త స్థానంలో కుర్చోపెడుతున్నారు అంటూ దీపా జయకుమార్ అన్నాడీఎంకే నాయకులను ప్రశ్నించారు. ఈ సమయంలో దీపా సోదరుడు దీపక్ ను నెచ్చెలి శశికళ రంగంలోకి తీసుకువచ్చారు.

జయలలిత అంత్యక్రియల సమయంలో దీపక్ ను పక్కనే పెట్టుకుని తూతూమంత్రంగా అతని దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని జయలలిత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. జయలలిత కుుటంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీలో కీలకదవిలో నియమించాలని డిమాండ్ చేశారు.

దక్షిణ తమిళనాడు ప్రాంతంలో జయలలిత మేనకోడలు దీపాకు మద్దతుగా పెద్ద ఎత్తున్న ఫ్లక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు శశికళకు పట్టు ఉన్న జిల్లాల్లో సైతం ఆమెకు వ్యతిరేకంగా కార్యకర్తలు పని చేస్తున్నారు.

Sasikala Natarajan is not fit for General Secretary of AIADMK.

అన్నాడీఎంకేలో కీలపాత్ర పోషిస్తున్న జే జయలలిత (జేజే) పెరవై సంస్థ నాయకులు మంత్రులుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జయలలిత వీరాభిమానులు జే దీపా పెరవై అనే సంస్థను ప్రారంభించారు.

సేలంలోని వార్డు నెంబర్ 44లొ మొదలైన జే దీపా పెరవై ఇప్పుడు సేలం మొత్తం అన్నాడీఎంకే కార్యకర్తలు దీపాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సేలం జిల్లాలో శశికళకు ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకుండా పని చేస్తామని అన్నాడీఎంకే కార్యకర్తలు శపథం చేశారు.

ఎలాంటి పరిస్థితిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి శశికళకు అప్పగించరాదని అమ్మ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జే దీపా పెరవై సంస్థ తెరమీదకు రావడంతో అన్నాడీఎంకే నాయకులు ఇప్పుడు ఆలోచనలోపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+