వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు శశికళ ఝలక్, పోయెస్ గార్డెన్‌లోకి నో ఎంట్రీ!: వ్యూహమేనా?

అన్నాడీఎంకే పగ్గాల కోసం పావులు కదుపుతున్న చిన్నమ్మ శశికళ తన భర్త నటరాజన్‌ను పోయెస్ గార్డెన్‌లోకి అనుమతించడం లేదని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పగ్గాల కోసం పావులు కదుపుతున్న చిన్నమ్మ శశికళ తన భర్త నటరాజన్‌ను పోయెస్ గార్డెన్‌లోకి అనుమతించడం లేదని తెలుస్తోంది. తన భర్తతో పాటు సోదరులను కూడా ఆమె అనుమతించడం లేదని సమాచారం.

పార్టీపై పట్టు కోసం శశికళ పావులు

పార్టీపై పట్టు కోసం శశికళ పావులు

జయలలిత వారం రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ పైన పట్టు కోసం శశికళ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే పగ్గాల కోసం ఆమె జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె మృతి అనంతరం శశికళ పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు.

ఇప్పటికే చక్రం తిప్పుతున్న శశికళ

ఇప్పటికే చక్రం తిప్పుతున్న శశికళ

పార్టీ చీఫ్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే, అనధికారికంగా ఇప్పటికే ఆమె పార్టీని నడుపుతున్నారు. జయలలిత నివాసం ఉన్న పోయెస్ గార్డెన్ నుంచి ఆమె చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నుంచి మొదలు మంత్రులు, మెజార్టీ నాయకుల వరకు శశికళకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఆమె చేతుల్లోకి వెళ్లవద్దని..

ఆమె చేతుల్లోకి వెళ్లవద్దని..

జయలలిత కోడలు దీప, పార్టీ నాయకులు శశికళ పుష్ప తదితరులు మాత్రం శశికళను వ్యతిరేకిస్తున్నారు. ఆమె చేతుల్లోకి పార్టీ వెళ్లవద్దని చెబుతున్నారు.

భర్తను రానివ్వకపోవడం వెనుక..

భర్తను రానివ్వకపోవడం వెనుక..

జయలలిత ఉన్నన్ని రోజులు శశికళ పార్టీని దగ్గరి నుంచి చూశారు. ఆమె కూడా ఎంతోకొంత చక్రం తిప్పారు. అమ్మ మృతి అనంతరం శశికళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆమె కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువవుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకే ఆమె తన భర్త నటరాజన్, సోదరులను పోయెస్ గార్డెన్ రానివ్వడం లేదని అంటున్నారు. పార్టీలో చక్రం తిప్పుతున్న శశికళ.. ఇప్పుడే తన భర్త, ఇతరులు వస్తే విమర్శలు రావొచ్చని భావించి, ప్రస్తుతానికి వారిని దూరం పెడుతున్నారని అంటున్నారు.

English summary
Sources said that Sasikala still not allowed her husband Natarajan and his brothers into Poes Garden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X