నా భర్తను చంపేస్తారా ? హై కోర్టులో స్టే తెస్తా: శశికళ పుష్ప చాలెంజ్
చెన్నై: తన భర్తను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టనని, చట్టపరంగా న్యాయపోరాటం చేసి నిందితులను కఠినంగా శిక్షించే వరకు నిద్రపోనని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అన్నారు.
బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? అని అనుమానం వస్తుందని, నడిరోడ్డు మీద ఓ న్యాయవాదితో పాటు నా భర్త లింగేశ్వర తిళగంను రక్తం వచ్చేటట్లు కొట్టారని, పోలీసులు సినిమా చూసినట్లు చూశారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
శశికళ నటరాజన్ తన మీద పగతో తన భర్త లింగేశ్వర తిళగంను హత్య చెయ్యడానికి ప్రయత్నించారని, అడ్డుకున్న తన న్యాయవాది మీద దాడి చేశారని ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ ఏమైనా శశికళ నటరాజన్ జాగీరా ? అని ప్రశ్నించారు.

తాను అదే పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లానని, శశికళ నటరాజన్ కు పార్టీలో ఏమి అధికారం ఉందని ఇలా ప్రవర్థిస్తున్నారు అని ప్రశ్నించారు. జయలలిత మరణించిన తరువాత శశికళ నటరాజన్ అమ్మ ఆస్తులతో పాటు ఆమె పదవులు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తాను ఇప్పటికే శశికళ మీద పోరాటం చెయ్యడానికి మద్రాసు హైకోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇప్పుడు తన భర్త, తన న్యాయవాది మీద హత్యాయత్నం చేశారని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరగకుండా స్టే తీసుకువచ్చి వీరికి తగిన బుద్ది చెబుతానని రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications