శశికళకు షాక్, పెరోల్ ఇవ్వడానికి కుదరదు, ఇప్పటికే అపవాదులు, ఇంకా కావాలా ?
అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ కు చుక్కెదురైయ్యింది.
బెంగళూరు/న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ కు చుక్కెదురైయ్యింది. పెరోల్ మీద బయటకు వెళ్లడానికి తాము అవకాశం ఇవ్వమని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు తేల్చి చెప్పారు.
శశికళ సొంత సోదరుడు సుందరవదనం సతీమణి సంతానలక్ష్మి మృతి చెందడంతో తనకు పెరోల్ ఇవ్వాలని చిన్నమ్మ కోర్టును ఆశ్రయించారు. అయితే శశికళకు పెరోల్ ఇవ్వరాదని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇప్పటికే శశికళ నటరాజన్ కు జైల్లో వీవీఐపీ సేవలు అందిస్తున్నారని అపవాదులు మూటకట్టుకున్న బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు ఇప్పుడు ఆమెకు పెరోల్ ఇవ్వడానికి అంగీకరిస్తే అందరూ దుమ్మెత్తిపోస్తారని పసిగట్టారు.
శశికళకు పెరోల్ ఇవ్వకూడదని, ఆమె జైలు నుంచి బయటకు వెలితే లేనిపోని సమస్యలు వస్తాయని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. పెరోల్ రాకపోవడంతో శశికళ షాక్ కు గురైనారని సమాచారం.












Click it and Unblock the Notifications