వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: చిన్నమ్మ, టీటీవీ దినకరన్ ఔట్: పండగ చేసుకుంటున్న శశికళ సోదరుడు!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆమె కుటుంబ సభ్యులు భిన్నంగా స్పందిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆమె కుటుంబ సభ్యులు భిన్నంగా స్పందిస్తున్నారు.

శశికళను, దినకరన్ ను ఎప్పుడో పార్టీ నుంచి బహిష్కరించాల్సి ఉండేదని, అయినా ఇప్పటికైనా ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని చిన్నమ్మ సోదరుడు దివాకరన్, ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. అన్నాడీఎంకే నాయకులు ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దివాకరన్ కుటుంబ సభ్యులు

దివాకరన్ కుటుంబ సభ్యులు

శశికళ, టీటీవీ దినకరన్ ను ఎప్పుడో పార్టీ నుంచి బహిష్కరించి ఉంటే ఇలాంటి సమస్యలు ఎదురు అయ్యే అకాశం ఉండేదికాదని, ఇప్పటికైనా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం, పన్నీర్ సెల్వం వర్గం సరైన నిర్ణయం తీసుకుందని శశికళ సోదరుడు దివాకరన్, ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.

మొదటి నుంచి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా

మొదటి నుంచి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి టీటీవీ దినకరన్ కు ఇవ్వడంతో శశికళ సోదరుడు దివాకరన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ అర్హతతో టీటీవీ దినకరన్ కు ఆ పదవి అప్పగించారని బహిరంగంగానే మీడియా ముందు అన్నాడీఎంకే నాయకులను ప్రశ్నించారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నామినేషన్ వేసిన టీటీవీ దినకరన్ మీద శశికళ సోదరుడు దివాకరన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దినకరన్ ను పోటీ నుంచి తప్పించి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) కుటుంబ సభ్యులకు అన్నాడీఎంకే పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని దివాకరన్ డిమాండ్ చేశారు.

మళ్లీ విరుచుకుపడిన సొంత ఫ్యామిలీ

మళ్లీ విరుచుకుపడిన సొంత ఫ్యామిలీ

శశికళ, దినకరన్ ను అన్నాడీఎంకే పార్టీ పదవుల నుంచి వెలివేయడంతో ఆమె సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ దివాకరన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి రోజు వస్తోందని తాను నెల ముందే చెప్పానని గుర్తు చేశారు.

మొదటి నుంచి అదే సీన్

మొదటి నుంచి అదే సీన్

మొదటి నుంచి టీటీవీ దినకరన్ చేష్టలతో దివాకరన్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి వచ్చినప్పటి నుంచి టీటీవీ దినకరన్ మిడిసి పడుతున్నాడని దివాకరన్ కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు.

ఇప్పుడు ఫ్యామిలీలో చిచ్చు

ఇప్పుడు ఫ్యామిలీలో చిచ్చు

శశికళకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడం లేదని స్పష్టంగా కనపడుతోంది. పార్టీ పదవితో పాటు సొంత కుటుంబ సభ్యులను నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో చిన్నమ్మ వర్గీయులు ఏం చెయ్యాలో తెలీక సతమతం అవుతున్నారు.

శశికళను జైల్లో

శశికళను జైల్లో

శశికళ జైలుకు వెళ్లిన తరువాత దివాకరన్, ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరు వైపు కన్నెత్తికూడా చూడలేదు. కనీసం ఆమె మీద జాలికూడా చూపించలేదు. అయితే దినకరన్ కు పార్టీలో కీలక పదవి ఇవ్వడం, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించడంతో రగిలిపోతున్న దివాకరన్ కుటుంబ సభ్యులు సమయం చిక్కినప్పుడు వారి మీద ముప్పేటదాడి చేస్తున్నారు.

English summary
VK Sasikala Natarajan's brother Divakaran and his family welcome the ADMK leader's oust of TTV Dinakaran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X