సరెండర్ కోసం శశికళ వెయిట్ చేయొచ్చా.. ఇదీ విధానం.. టైంచెప్పని సుప్రీం
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు సుప్రీం కోర్టు మంగళవారం నాడు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటి వరకు ఆమె సరెండర్ కాలేదు. ఆమె గురించిన ఎలాంటి సమాచారం కూడా ట్రయల్ కోర్టుకు రాలేదు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు సుప్రీం కోర్టు మంగళవారం నాడు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటి వరకు ఆమె సరెండర్ కాలేదు. ఆమె గురించిన ఎలాంటి సమాచారం కూడా ట్రయల్ కోర్టుకు రాలేదు.
ఇదీ ప్రొసీజర్
ప్రొసీజర్ ప్రకారం.. సుప్రీం కోర్టు రిజిస్ట్రీ బెంగళూరు కోర్టుకు ఇందుకు సంబంధించిన కాపీలను పంపిస్తారు. ఆ తర్వాత ఈ మ్యాటర్ ట్రయల్ కోర్టుకు చేరుకుంటుంది.

ఈ కేసులో శిక్ష పడిన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు కోర్టుకు సరెండర్ కాకుంటే వారి పైన అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు.
కాపీ వచ్చే వరకు శశికళ, శిక్ష పడిన ఇతరులు నిరీక్షించాల్సిన అవసరం లేదని, వారు సరెండర్ కావొచ్చునని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెళ్లి సరెండర్ కావాలని సుప్రీం కోర్టు శశికళ చెప్పింది.
మరో విషయమేమంటే ఈ కేసులో సరెండర్ అయ్యేందుకు సుప్రీం కోర్టు నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలేదు. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా కాపీ వచ్చే వరకు నిరీక్షించవచ్చునని కూడా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, తనకు ఆరోగ్యం బాగా లేదని చెబుతూ శశికళ నాలుగు వారాల సమయం సుప్రీం కోర్టును కోరే అవకాశముంది. అంతేకాదు ఆమె రివ్యూ పిటిషన్ కూడా వేయనున్నారు. రివ్యూ పిటిషన్‌ను తీర్పు చెప్పిన బెంచ్ చూస్తుంది.
ఇదిలా ఉండగా శశికళ రివ్యూ పిటిషన్‌తో పాటు క్యురేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేయవచ్చునని అంటున్నారు. అయితే దీనిపై తీర్పుకు సమయం పడుతుంది. కాబట్టి ఆమె అప్పటి దాకా స్టే విధించమని కోరవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications