వందమంది' మద్దతు: శశికళకు అడ్డంకులు తొలగుతున్నాయా?

అన్నాడీఎంకే చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు చిన్నమ్మ శశికళకు ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇద్దరు ముగ్గురు మినహా అందరూ ఆమెకు అనుకూలంగా ఉన్నారు.

చెన్నై: అన్నాడీఎంకే చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు చిన్నమ్మ శశికళకు ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇద్దరు ముగ్గురు మినహా అందరూ ఆమెకు అనుకూలంగా ఉన్నారు. దాదాపు వంద మంది ఎమ్మెల్యేలకు పైగా ఆమెకు మద్దతు పలుకుతున్నారు.

ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, సీనియర్ నేతలు, మంత్రులు సహా పలువురు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆమెను పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరగా.. నవ్వుతూ శశికళ లోనికి వెళ్లారని తెలుస్తోంది. పగ్గాలు చేపట్టేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

శశికళపై అన్నాడీఎంకే పత్రిక ప్రశంసలు

శశికళపై అన్నాడీఎంకే పత్రిక ప్రశంసలు

స్వయంగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. శశికళకు మద్దతిస్తున్నారు. ఇటీవలి వరకు శశికళకు రేసులో పన్నీరు సెల్వం కూడా ఓ పోటీదారుగా భావించారు. కానీ గత నాలుగైదు రోజులుగా ఆయన తీరు మాత్రం శశికళకు అనుకూలంగా ఉంది. అన్నాడీఎంకే అధికార పత్రిక కూడా శశికళ పైన ప్రశంసలు కురిపిస్తోంది.

శశికళకు మద్దతు

శశికళకు మద్దతు

ఇప్పటికే శశికళకు అనుకూలంగా మాట్లాడిన పన్నీరు సెల్వం మరోసారి జై కొట్టారు. అమ్మ జయలలిత తర్వాత అంతటి సమర్థురాలు శశికళే అని చెబుతున్నారు. శశికళతో తనకు విభేదాలు లేవని, పుకార్లను పట్టించుకోవద్దన్నారు.

ముఖ్యమంత్రి నుంచి నాయకుల వరకు..

ముఖ్యమంత్రి నుంచి నాయకుల వరకు..

శశికళ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమే బాధ్యతలు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్, లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రులు, పార్టీకి చెందిన పలువురు నేతలు రెండు రోజుల క్రితం పోయెస్ గార్డెన్‌లో శశికళను కలిసి పార్టీ బాధ్యతలు చేపట్టాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

జయలలితకు గుడి

జయలలితకు గుడి

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గుడి కట్టాలని అన్నాడీఎంకే కార్యకర్తలు నిర్ణయించారు. తంజావూరులో ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించారు.

చెప్పులు వద్దు

చెప్పులు వద్దు

కాగా, జయలలిత నివాసంలోకి వెళ్లేవారు పాదరక్షలు ధరించకూడదని పోలీసులు సూచిస్తున్నారట. జయలలిత మృతి చెందిన తర్వాత పోయెస్ గార్డెన్‌లోని ఆమె నివాసాన్ని సందర్శించడానికి అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారిని తనిఖీ చేసి వరుసలో లోనికి అనుమతిస్తున్నారు. బ్యాగులు, పాదరక్షలు వంటివి బయటే ఉంచాలని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+