జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !

అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకున్న శశికళ చాల మాయ చేశారని వెలుగు చూసింది. కోర్టు విధించిన శిక్ష అనుభవించకుండా దర్జాగా జైలు .

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకున్న శశికళ చాల మాయ చేశారని వెలుగు చూసింది. కోర్టు విధించిన శిక్ష అనుభవించకుండా దర్జాగా జైలు బయట ఉన్నారని వెలుగు చూసింది.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుల్లో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ అడుగుపెట్టి నేటికి 119 రోజు అయ్యింది. అయితే ఆమె 119 రోజులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో లేరని తాజాగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

జైల్లో శశికళ ఏం చేశారంటే !

జైల్లో శశికళ ఏం చేశారంటే !

జైల్లో శశికళ కోసం సకలసదుపాయాలు ఏర్పాటు చేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. సోమవారం (జులై 17) నుంచి చిన్నమ్మ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆమెకు కేటాయించిన గదులు, వంట సామాగ్రి, టేబుల్, కుర్చీలు, టీవీ, ఫ్యాన్ తదితర సదుపాయాలు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

వీల్ చేర్ లో విజిటర్స్ ను !

వీల్ చేర్ లో విజిటర్స్ ను !

జైల్లోకి శశికళ వీల్ చేర్ తెప్పించుకున్నారని, అందులో కుర్చుని తనను కలవడానికి వచ్చే వారితో దర్జాగా మాట్లాడుతున్నారని ఇటీవల జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్ విభాగానికి బదిలి అయిన డీఐజీ రూప మీడియాతో అన్నారని తమిళ మీడియా శుక్రవారం వార్తలు ప్రసారం చేసింది.

జైల్లో శశికళ 13 రోజులే

జైల్లో శశికళ 13 రోజులే

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలో కేవలం 13 రోజులు మాత్రమే శశికళ ఉన్నారని శుక్రవారం షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మిగిలిన రోజులు మొత్తం శశికళ సెంట్రల్ జైలుకు సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉన్నారని వెలుగు చూసింది.

మన్నార్ గుడి మాఫియా ఫ్లాట్

మన్నార్ గుడి మాఫియా ఫ్లాట్

బెంగళూరు చేరుకున్న మన్నార్ గుడి మాఫియా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సమీపంలోనే రెండు ఖరీదైన ఫ్లాట్ లో నివాసం ఉంటూ శశికళ కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు. జైలు నుంచి శశికళ బయటకు వచ్చిన తరువాత అదే అపార్ట్ మెంట్ లో బస చేశారని వెలుగు చూసింది.

వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి ?

వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి ?

సెంట్రల్ జైలు నుంచి శశికళ బయటకు రావడం, తరువాత లోపలికి వెళ్లిన సమయంలో రికార్డు అయిన సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ సైతం ఉన్నాయని కర్ణాటకకు చెందిన ఓ పోలీసు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారని తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. అధికారులు సెంట్రల్ జైలు పరిశీలించడానికి వచ్చే సమయంలోనే శశికళ జైల్లోకి వచ్చేవారని, మిగిలిన రోజులు బయటజీవితం గడిపారని ఆరోపణలు గుప్పుమన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+