శశికళ వర్గానికి సినిమా: ఎన్నికల కమిషన్ దగ్గరికి పరుగో పరుగు!

చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ వర్గానికి అప్పుడే దడ పుట్టింది. అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కోసం సరైన పత్రాలు సమర్పించడానికి మాకు ఇంకా సమయం కావాలని ఎన్నికల కమిషన్ దగ్గరకు పరుగు తీసి అధికారులకు మనవి చేశారు.

అన్నాడీఎంకే పార్టీకి చెందిన సర్వహక్కులతో పాటు రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గం ఎన్నికల కమిషన్ ముందు పోటీ పడుతున్నాయి. ఈనెల 17వ తేదీ లోపు రెండు వర్గాల్లో ఎవరికో ఒకరికి రెండాకుల చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారు

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా నిరూపించుకుంటాం అంటూ ఇన్ని రోజులు నానా హంగామా చేసిన శశికళ వర్గం చివరికి తుస్సుమంది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దు కావడంతో ఇప్పుడు వారి పరిస్థితి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు అయ్యింది.

దినకరన్ స్కెచ్ రివర్స్ అయ్యింది

దినకరన్ స్కెచ్ రివర్స్ అయ్యింది

తమ వర్గంలోని నాయకుల సహకారంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్ష మంది అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల దగ్గర సంతకాలు చేయించి ఎన్నికల కమిషన్ ముందు బలనిరూపణ చేసుకోవాలని టీటీవీ దినకరన్ ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో అది కాస్త రివర్స్ అయ్యింది.

ఆర్ కే నగర్ ఎన్నికల ఎఫెక్ట్

ఆర్ కే నగర్ ఎన్నికల ఎఫెక్ట్

టీటీవీ దినకరన్ అనుచరులు ఆర్ కే నగర్ నియోజక వర్గంలో విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టారని ఐటీ శాఖ అధికారుల దాడుల్లో వెలుగు చూసింది. ఇప్పుడు మీకు మద్దతుగా సంతకాలు చేస్తే ఎంత డబ్బులు ఇస్తారు అంటూ కార్యకర్తలు దినకరన్ అనుచరులను సూటిగానే ప్రశ్నిస్తున్నారని సమాచారం.

పన్నీర్ సెల్వం స్కెచ్ సూపర్

పన్నీర్ సెల్వం స్కెచ్ సూపర్

రెండాకుల చిహ్నం మాకే కేటాయించాలని, మాదే అసలైన అన్నాడీఎంకే పార్టీ అంటూ పన్నీర్ సెల్వం వర్గీయులు ఎన్నికల కమిషన్ ముందు వాదించడానికి సిద్దం అయ్యారు. పక్కా ప్లాన్ తో పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమిషన్ ముందు హాజరుకావడానికి సిద్దంగా ఉందని సమాచారం.

అవకాశం ఇస్తారా ?

అవకాశం ఇస్తారా ?

తమకు 8 వారాలు గడువు ఇస్తే పూర్తి ఆదారాలతో మీ ముందుకు వస్తామని, ఆ అవకాశం కల్పించాలని శశికళ వర్గం ఎన్నికల కమిషన్ కు మనవి చేసింది. అయితే అన్ని రోజులు అవకాశం ఇచ్చే ఆస్కారం లేదని, పన్నీర్ సెల్వం వర్గం అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+