బెంగళూరు సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ పుట్టిన రోజు వేడుకలు, మన్నార్ గుడి మాఫియా !

సెంట్రల్ జైల్లో శశికళ పుట్టిన రోజు వేడుకలు బెంగళూరులో మకాం వేసిన మన్నార్ గుడి మాఫియా బర్త్ డే విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడిన జైలు అధికారులు

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడి చివరికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరిన చిన్నమ్మ శశికళ శుక్రవారం (ఆగస్టు 18వ తేదీ) మొదటి సారి కారాగారంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. శశికళకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మన్నార్ గుడి మాఫియా బెంగళూరులో మకాం వేసింది.

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మొదటి సారి జైల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న శశికళను చూడటానికి మన్నార్ గుడి మాఫియా మొత్తం బెంగళూరు చేరుకునింది.

Sasikala today celebrates her birthday at Parapana agrahara jail

అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఒక్క రోజు ముందుగానే గురువారం బెంగళూరు చేరుకుని జైల్లో శశికళ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిసింది.

జైల్లో ఇప్పటికే వీవీఐపీ మర్యాదలు స్వీకరిస్తున్న శశికళ తన పుట్టి రోజు వేడుకలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో ఊహిస్తే అర్థం అవుతోంది. శశికళ పుట్టిన రోజు వేడుకల వివరాలు బయటకు రాకుండా చూడాలని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు మీడియా ప్రతినిధులు వివరాలు తెలుసుకోవడానికి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గర మకాం వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+