జైల్లో శశికళ జల్సాలు, సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ నిజమే, ఆమె అక్కడ దర్జాగా: డీఐజీ రూప !

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ హల్ చల్ చేస్తున్న మాట నిజమే అంటూ కర్ణాటక ఐపీఎస్ అధికారిని, ట్రాఫిక్ విభాగం డీఐజీ రూప అన్నారు.

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ హల్ చల్ చేస్తున్న మాట నిజమే అంటూ కర్ణాటక ఐపీఎస్ అధికారిని, ట్రాఫిక్ విభాగం డీఐజీ రూప అన్నారు. ఇటీవల మీడియాలో వచ్చిన సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ నిజమైనవే అని చెప్పారు.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని క్లప్పింగ్స్ మీడియాలో వచ్చాయని, అవి నకిలీ క్లిప్పింగ్స్ కాదని డీఐజీ రూప చెప్పారు. అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ జైల్లో అక్కడ ఖైదీలకు ఇచ్చే యూనీఫాం వేసుకోవడం లేదని అన్నారు.

Sasikala video not fake its real says Roopa IPS

మామూలు దుస్తులు వేసుకుంటున్న శశికళ దర్జాగా వరండాలో తిరుగుతున్నారని, చాల స్వేచ్చగా ఆమె తిరుగుతున్నా అక్కడి సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని సీసీ కెమెరాల క్లిప్పంగ్స్ ఎలా బయటకు వచ్చాయి ? అనే విషయం తనకు తెలీదని రూప అన్నారు.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు కేటాయించిన గదులు, ఆమె చుడిధార్ వేసుకుని చేతిలో బ్యాగ్ పట్టుకుని హాల్ హల్ చల్ చేస్తున్న వీడియో క్లిప్పింగ్స్ బయటకు రావడంతో జైలు అధికారులు హడిలిపోయారు. వెంటనే శశికళకు జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతులు మొత్తం కట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+