రాష్ట్రపతి, మోడీ, రాహుల్ గాంధీలకు శశికళ థ్యాక్స్: ఎందుకంటే ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పుడు రాజకీయంగా అందరికి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులకు దగ్గర అవ్వడానికి ఆమె మొదటి సారి ముందడుగు వేశారు.
పోయెస్ గార్డెన్ లో మకాం వేసిన శశికళ నాటరాజన్ మొదటి సారి అన్నాడీఎంకే పార్టీ నాయకురాలిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు లేఖ రాశారు.
జయలలిత మరణించిన సమయంలో మీరు స్వయంగా చెన్నై వచ్చి అమ్మకు నివాళులు అర్పించారని, ఆమె అంత్యక్రియల్లో పాల్గొని అంతిమవీడ్కోలు పలికినందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని లేఖ రాశారు.
ముఖ్యంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆరోజు మీరు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినా మళ్లీ మీరు చెన్నై చేరుకుని జయలలితకు నివాళులు అర్పించడంతో తమిళ ప్రజలు ఆశ్చర్యానికి గురైనారని, అమ్మ మీద మీకు ఉన్న అభిమానం చూసి ధన్యవాదాలు చెప్పారని గుర్తు చేశారు.

మీరు అమ్మ జయలలిత పట్ల చూపించిన గౌరవం జీవితంలో ఎప్పటికి మరువలేమని శశికళ లేఖలో వివరించారు. అదే విధంగా కష్టకాలంలో ఉన్న తమిళ ప్రజలకు మీరు పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటామని హామి ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు శశికళ కృతజ్ఞతలు తెలిపారు.
శశికళ మొదటి సారి పోయెస్ గార్డెన్ నుంచి అధికారికంగా లేఖలు రాయడంతో తమిళనాడు రాజకీయ నాయకలు ఆసక్తిగా గమనిస్తున్నారు. శశికళ జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులతో టచ్ లో ఉండటానికి మొదటి సారి ముందడుగు వేశారని అంటున్నారు.
జయలలిత తరువాత తాను అన్నాడీఎంకే పార్టీకి ప్రతినిధి అని చెప్పకనే చెబుతున్నారని, ఇప్పుడు ఈ లేఖ ద్వారా శశికళ జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీల నాయకులకు దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Thirumathi.V.K.Sasikala's generous & thanking letter to our Honourable President, Prime Minister & Mr. Rahul Gandhi. pic.twitter.com/Bi44Gvhxc1
— AIADMK (@AIADMKOfficial) 20 December 2016












Click it and Unblock the Notifications