జల్లికట్టుపై శశికళ కామెంట్స్.. అన్నాడీఎంకె చీఫ్ హోదాలో తొలిసారి..
జల్లికట్టుపై చట్టాలు తెలియకుండా డీఎంకె నేత స్టాలిన్ వాదిస్తున్నారని శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై: అన్నాడీఎంకె పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ అధినేత్రి హోదాలో తొలిసారి శశికళ ఓ అంశంపై స్పందించారు. తమిళనాడులో నిర్వహించే వివాదస్పద జల్లికట్టు క్రీడపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జల్లికట్టు క్రీడను నిషేధించడంలో కాంగ్రెస్, డీఎంకె పార్టీల హస్తముందని ఆరోపించారు.

ఆ రెండు పార్టీల హయాంలోనే జల్లికట్టును నిషేధించారని గుర్తుచేశారు. తమిళ సాంప్రదాయ క్రీడపై నిషేధం విధించిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు పూర్తి అవాస్తవాలు మాట్లాడుతున్నాయని అన్నారు. జల్లికట్టుపై చట్టాలు తెలియకుండా డీఎంకె నేత స్టాలిన్ వాదిస్తున్నారని శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడం కోసం గతంలో అమ్మ జయలలిత మోడీకి లేఖ రాశారని శశికళ గుర్తుచేశారు.
కాగా, ఈరోజు సమావేశమైన డీఎంకె జనరల్ బాడీ ఇదే విషయంపై తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా ఆ పార్టీ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే, జంతు సంరక్షణకు భంగం కలిగించేదిగా ఉన్నందునా.. 2014 ప్రారంభంలో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది. దీంతో అప్పటినుంచి దీనిపై వివాదం జరుగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications