భర్త నటరాజన్ తో శశికళ భేటీ: వెంటనే పత్రికా ప్రకటన, పరిస్థితి విషమంగానే ఉంది, అయితే !

అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం విషమంగానే ఉందని, అయితే ఆయన కోలుకుంటారనే నమ్మకం ఉందని చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం విషమంగానే ఉందని, అయితే ఆయన కోలుకుంటారనే నమ్మకం ఉందని చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నటరాజన్ కు ఆసుపత్రిలో ఇంకా కొంత కాలం చికిత్స చెయ్యాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

శశికళ ఆమె భర్తను కలుసుకున్న తరువాత ఆసుపత్రి వర్గాలు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ కే. ఇళన్ కుమరన్ పేరుతో పత్రికా ప్రకటన విడుదల అయ్యింది. అందులో నటరాజన్ లివర్, కిడ్నీ వ్యాదితో ఆసుపత్రిలో చేర్చారని వివరించారు.

Sasikalas husband critical but recovering says Globalhospital

వెంటిలేటర్ సహాయంతో నటరాజన్ కు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స చేశారని అన్నారు. అక్టోబర్ 4వ తేదీన నటరాజన్ కు లివర్, కిడ్నీల మార్పిడి శాస్త్ర చికిత్స చేశామని వివరించారు. నటరాజన్ కు వయసు ఎక్కువ కావడంతో ఆయనకు మరింత చికిత్స చెయ్యాలని గుర్తు చేశారు.

శాస్త్ర చికిత్స ద్వారా అమర్చిన లివర్, కిడ్నీ అవయవాలు పూర్తిగా పని చేసి ఆయన శరీరానికి సహకరించిన తరువాత ఆసుపత్రి నుంచి పంపిస్తామని అన్నారు. 19 ఏళ్ల యువకుడు తంజావూర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై బ్రెన్ డెడ్ కావడంతో అతని అవయవాలు నటరాజన్ కు దానం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+