పళనిస్వామిని 'పళనియమ్మ'ను చేసిన సీఆర్ సరస్వతి..
అమ్మ.. చిన్నమ్మలను స్మరించిన ఆ నోళ్లు అంత తొందరగా వేరే పేర్లకు అలవాటు పడటం కాస్త కష్టమే.
చెన్నై: అమ్మ.. అమ్మ.. అంటూ ఇన్నాళ్లు జయలలిత నామస్మరణ చేసిన అన్నాడీఎంకె నేతలు ఆమె మరణానంతరం చిన్నమ్మ శశికళకు జై కొడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ.. చిన్నమ్మలను స్మరించిన ఆ నోళ్లు అంత తొందరగా వేరే పేర్లకు అలవాటు పడటం కాస్త కష్టమే.
అందుకేనేమో పళనిస్వామిని కాస్త 'పళనియమ్మ'ను చేసేశారు సీఆర్ సరస్వతి. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన అన్నాడీఎంకె అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి.. పళనిస్వామిగా బదులుగా పళనియమ్మ అని తప్పుగా ఉచ్ఛరించారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై సెటైర్స్ పడుతూనే ఉన్నాయి.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా, ఇదివరకు పన్నీర్ సెల్వంపై కూడా ఇలాంటి జోక్స్ పేలిన సంగతి తెలిసిందే. బస్‌లో లేడీస్ సీటులో కూర్చున్న వ్యక్తిలా.. అమ్మ.. చిన్నమ్మ.. లాంటి వాళ్లు వచ్చినప్పుడల్లా సీఎం కుర్చీని ఖాళీ చేయడం పన్నీర్ కు అలవాటని నెటిజెన్స్ సెటైర్స్ వేశారు.
ఏదేమైనా ఏళ్ల పాటు 'అమ్మ' చుట్టూ తిరిగిన అన్నాడీఎంకె రాజకీయం ఒక్కసారిగా పురుషుల పరిధిలోకి వచ్చేసరికి.. జనం నుంచి ఇలాంటి సెటైర్స్ వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications