ఉత్తరఖాండ్ సీఎం రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి ఎవరు, రేసులో వీరిద్దరీ పేర్లు

ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సిగ్ రావత్ సీఎం పదవీకి రాజీనామా చేశారు. మరీ కొత్త సీఎం ఎవరు. రేసులో ఎవరు ఉన్నారనే చర్చ జరుగుతుంది. సీఎం పోస్టు కోసం రెండు పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. సత్పాల్ సింగ్. రెండో పేరు ధన్‌సింగ్ రావత్. ఈ రెండు పేర్లలో ఏదో ఒక పేరును అధిష్ఠానం ఫైనల్ చేయనుంది. వీరిద్దరూ సీనియర్ నేతలే కావడం గమనార్హం.

తీరథ్ సింగ్ రావత్ మార్చి 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పౌరీ గర్వాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సెప్టెంబరు 10లోగా ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ ప్రకారం లోక్‌సభ, శాసన సభ స్థానాలు ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. అయితే కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవీ కాలం కనీసం ఒక సంవత్సరం ఉండాలి. కానీ ఉత్తరాఖండ్ శాసన సభ పదవీ కాలం సుమారు తొమ్మిది నెలలే మిగిలింది.

 Satpal Maharaj and Dhan Singh Rawat race for Uttarakhand CM post

ఇటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించే చట్టం ఏదీ లేదని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలను నిర్వహించాలనుకుంటే నిరోధించే నిబంధనలు కూడా లేవని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. తీరథ్ సింగ్ రావత్‌ను బీజేపీ అధిష్ఠానం అకస్మాత్తుగా ఢిల్లీకి పిలిపించింది. ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. తిరిగి ఉత్తరాఖండ్ చేరుకోవలసి ఉంది. కానీ ఆయనను ఢిల్లీలోనే ఉండాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాత.. రాజీనామా చేశారు.

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జేపీ నడ్డాకు అందజేశారు. 4 నెలల క్రితం ఆయన సీఎం పదవీ చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+