Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సినిమాల్లో నటిస్తున్న వివాదాస్పద మాజీ డీసీఎం, ఆయన ఎప్పుడు హాట్ టాపిక్ !

బెంగళూరు/బెళగావి: పలువురు రాజకీయ నేతలు సినిమాలు (movies), సీరియల్స్‌లో (TV) రంగులు వేసుకుని నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వివాదాస్పద రాజకీయ నాయకుడు తెర మీద దర్శనం ఇవ్వనున్ననారు. అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లోనూ చాలా మంది నాయకులు చాలా బిజీబిజీగా ఉంటున్నారు. సినీ (movies)ప్రముఖులు రాజకీయ నేతలుగా ఉన్నారు.

ఇప్పుడు ఈ వరుసలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేరారు. రాజకీయాలకు అతీతంగా కన్నడ సినిమాలో (movies) నటించేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి (DCM), అథణి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ సవది అంగీకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అథణి నుంచి 1, 31, 404 ఓట్ల బంపర్ మెజారిటీతో లక్ష్మణ పవది ఎమ్మెల్యేగా (mla) ఎన్నికయ్యారు.

 MLA of Karnataka who is acting in movies
నాగారెడ్డి (Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నడ చిత్రం 'దేశాయ్‌'లో లక్ష్మణ సవది అతిథి పాత్రలో నటిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న మాజీ డీసీఎం లక్ష్మణ సవది ఆయన బంధువుల ఒత్తిడికి తలొగ్గి ముఖానికి రంగులు వేస్తున్నారు. దేశాయ్‌' పేరుతో మహంతేశ్‌ చోళచగూడ ఓ చిత్రాన్ని (movies) నిర్మిస్తున్నారు. నిర్మాత లక్ష్మణ సవదికి సమీప బంధువు అని తెలిసింది.

ఈ నేపథ్యంలో నిర్మాత పట్టుబట్టడంతో లక్ష్మణ సవది ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటిస్తున్నారు. కర్ణాటకలోని (karnataka) బాగల్‌కోట్‌ పరిసర ప్రాంతాల్లో ఈ దేశాయ్ సినిమా (movies) షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బాగల్‌కోట్ జిల్లా మహాలింగపురలో జరుగుతోంది. లక్ష్మణ సవది షూటింగ్‌లో పాల్గొని తన పాత్రలో సమర్ధవంతంగా సాదాసిదాగా నటించారని కన్నడ మిడియా అంటోంది.

దేశాయ్ సినిమాలో (movies) మల్లయోధులకు అవార్డులిచ్చే సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది. రెజ్లింగ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తూ వారిని ప్రోత్సహించే పాత్రలో మాజీ డీసీఎం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే (mla) లక్ష్మణ సవది నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. బీజేపీని (bjp) వీడిన లక్ష్మణ సవది ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అథణిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహేశ్ కుమతల్లిపై లక్ష్మణ సవది ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీజేపీ (movies) హైకమాండ్ లక్ష్మణ సవదిని ఎమ్మెల్సీని చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లక్ష్మణ సవది (minister) కర్ణాటక ఉపముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో ఉప ముఖ్యమంత్రితో పాటు లక్ష్మణ సవదికి రవాణా శాఖ బాధ్యతలు అప్పగించారు.

 MLA of Karnataka who is acting in movies
మారిన రాజకీయ పరిస్థితుల్లో అథణి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మహేష్ కుమటల్లి విజయం సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ (movies) కావాలని లక్ష్మణ సవది బహిరంగంగానే చెప్పారు. అయితే అభ్యర్థుల తొలి జాబితాలో మహేశ్ కుమతల్లి అభ్యర్థి అని బీజేపీ ప్రకటించింది. ఆ పార్టీ నేతలతో విసిగిపోయిన లక్ష్మణ సవది బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, విధాన పరిషత్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

లక్ష్మణ సవది బీజేపీని వీడి కాంగ్రెస్‌లో (congress)చేరారు. అథణి నియోజకవర్గ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. మాజీ డీసీఎం లక్ష్మణ సవది, మహేష్ కుమటలి మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి మహేష్ కుమటలి 55,282 ఓట్లు సాధించి (MLA) ఓడిపోయారు. లక్ష్మణ సవది ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి (MLA) లేకపోయినా లక్ష్మణ సవది పార్టీలో పట్టు సంపాధించుకున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మొబైల్ లో పోర్న్ వీడియోలు చూస్తూ లక్ష్మణ సవది మీడియాకు అడ్డంగా చిక్కిపోయి వివాదంలో చిక్కుకుని తరువాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+