'భూకంపం దెబ్బకు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన ఓ మహిళను చూశాను'
కోల్‌కత్తా: శనివారం ఉదయం భారత్‌లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప అనుభూతిని తాను కూడా పొందానని బాలీవుడ్ హీరో మజోన్ బాజ్‌పాయ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈరోజు ఉదయం కోల్‌కత్తా ఎయిర్ పోర్టులో ప్లయిట్ కోసం వేచి ఉన్న నేను ఈ భూకంపం అనుభూతిని పొందానని ట్వీట్ చేశాడు.
At the bagdogra airport.people were running helter skelter.it was a scary sight at the airport.
— Manoj Bajpayee (@BajpayeeManoj) April 25, 2015 My prayers are with the people affected by the massive earthquake in nepal and india.saw a woman losing her mental balance due to the impact
— Manoj Bajpayee (@BajpayeeManoj) April 25, 2015 Standed outside the hotel in siliguri with my friend @RajeshJoshi .not allowed to get in. pic.twitter.com/BjuciCyQkK
— Manoj Bajpayee (@BajpayeeManoj) April 25, 2015 అంతేకాదు ఈ భూకంప ప్రభావానికి లోనై ఓ మహిళ తన మానసిక సంతులనం కోల్పోయిందని కూడా ట్వీట్ చేశాడు. తెలుగులో హ్యాపీ, వేదం, కొమరం పులి లాంటి సినిమాల్లో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ బీబీసీ రేడియో సన్మానోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సిలిగురిలో ఉన్నారు.

భూకంపం తీవ్రతకు సిలిగురిలోని హోటల్‌లో వారంతా బయటకు వచ్చిన ఫోటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంలోనే భూకంప తీవ్రతకు ఓ మహిళ తన మానసిక సంతులనాన్ని కోల్పోయిన విషయాన్ని గమనించినట్లు పేర్కొన్నారు.
నేపాల్, ఇండియాలో సంభవించిన ఈ భూకంపానికి బాధితులైన వారికి తన సంఘీభావాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications