నోట్ల రద్దు: ఎస్‌బీఐలో రూ. లక్ష కోట్లకు మించిన డిపాజిట్లు
ముంబై: నల్లధనం, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసిన నేపథ్యంలో పలు బ్యాంకుల్లో భారీగా డబ్బులు డిపాజిట్లుగా చేరిపోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనైతే ఇది ఇంకా అధిక మొత్తంలో ఉంది.
కేవలం ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడు రోజుల్లో 240.90 లక్షల నగదు డిపాజిట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది.
నవంబర్ 8న ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. నవంబర్ 10 నుంచి బ్యాంకులు లావాదేవీలు జరిపాయి. డిపాజిట్లపై పరిమితి లేకపోవడంతో భారీ మొత్తంలో జమ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే 14వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయలేదు. నవంబర్ 10వ తేదీ నుంచీ రూ.500 రూ.1,000 నోట్ల పాత నోట్ల మార్పిడి విలువ రూ.5,776 కోట్లు.

రూ.18,665 కోట్ల విత్‌డ్రావల్స్ జరిగాయి. ఇందుకు సంబంధించి లావాదేవీల సంఖ్య 151.93 లక్షల కోట్లు. రోజుకు రూ.4,500కు సమానమైన రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణల పరిమితి రోజుకు రూ.2,500. ఏటీఎం విత్‌డ్రావల్స్ సహా స్లిప్ లేదా చెక్ ద్వారా వారానికి రూ.24,000 విత్‌డ్రాయల్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కాగా, బ్యాంకింగ్‌లో భారీ డిపాజిట్లపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- మూడీస్ తాజాగా స్పందించింది. విత్‌డ్రాయల్ నిబంధనలు సడలించిన వెంటనే బ్యాంక్ డిపాజట్లు బారీగా పడిపోతాయని పేర్కొంది. డిపాజిట్ల జోరు మరో 3-4 వారాలు కొనసాగుతుందని అంచనా వేసింది. గత వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు కావడం గమనార్హం.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications