షాక్: సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేటును తగ్గించిన ఎస్‌బిఐ
ఎస్‌బిఐ తన ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది. పొదుపు ఖాతాలపై చెల్లించే వడ్డీని తగ్గించింది. వడ్డీరేటును 0.5 శాతం నుండి (50 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది. ఈ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్‌బి
న్యూఢిల్లీ: ఎస్‌బిఐ తన ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది. పొదుపు ఖాతాలపై చెల్లించే వడ్డీని తగ్గించింది. వడ్డీరేటును 0.5 శాతం నుండి (50 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది. ఈ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్‌బిఐ ప్రకటించింది.
ఇటీవలనే వివిద మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 50 పాయింట్ల మేరకు తగ్గించింది ఎస్‌బిఐ. సేవింగ్స్ ఖాతాలపై వార్షిక వడ్డీ రేటను 0.5 శాతం తగ్గిస్తున్నట్టు ఎస్‌బిఐ ప్రకటించింది.

రూ. కోటివరకు ఉన్న సేవింగ్స్ డిపాజిట్లపై గతంలో 4శాతం వడ్డీ ఇస్తుండగా ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి తగ్గించినట్టు బ్యాంకు ప్రకటించింది. రూ. కోటికిపైగా ఉంటే మాత్రం 4 శాతం వడ్డీని మాత్రమే వడ్డీని ఇవ్వనుంది.
ద్రవ్యోల్బణ రేటు తగ్గడం వల్లే వడ్డీ రేట్లను తగ్గించినట్టు ఎస్‌బిఐ ప్రకటించింది. మరో వైపు వడ్డీరేట్లను తగ్గించినట్టు ప్రకటించడంతో బుల్ మార్కెట్‌లో ఎస్‌బిఐ షేర్ 4 శాతం లాభాలతో ట్రేడ్ అవుతోంది.
ఒకవైపు ప్రైవేట్ బ్యాంకులన్నీ 6 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఎస్‌బిఐ మాత్రం ఇప్పటికీ 4 శాతం వడ్డీని మాత్రమే ఇస్తోంది. దీనిపై కూడ కోత పెట్టడం గమనార్హం.












Click it and Unblock the Notifications