ఎస్‌బీఐలో 554 ఉద్యోగాలు: ఇప్పుడే ఆప్లై చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఇండియా తన అధికారిక వెబ్ సైట్ ద్వారా 554 స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(ఎస్ఎంఈ-బ్యాంకింగ్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మే 18, 2017లోగా ఆన్‌లై

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఇండియా తన అధికారిక వెబ్ సైట్ ద్వారా 554 స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(ఎస్ఎంఈ-బ్యాంకింగ్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మే 18, 2017లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్‌బీఐ ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టులు: 554

SBI Recruitment 2017 Apply Online for 554 (SME) Vacancies

పోస్టు పేరు: స్పెషల్ కేడర్ ఆఫీసర్(ఎస్ఎంఈ)(బ్యాంకింగ్)

1. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ III: 273 పోస్టులు
2. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ II: 281 పోస్టులు

అర్హత: స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(బ్యాంకింగ్) కావాలనుకునే అభ్యర్థులు ఫైనాన్స్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఏసీఏ/ఎంబీఏ లేదా ఫైనాన్స్‌లో తత్సమాన/పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ.

జీతం వివరాలు: నెలకు రూ. 31,705 -45,950/-

వయో పరిమితి: 25 నుంచి 40ఏళ్లు, 31మార్చి, 2017 వరకు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష కోసం అభ్యర్థులకు అడ్మిట్ కార్డు 2017 జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ, చివరగా డాక్యుమెంట్ల పరిశీలన ఉంటుంది.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్లో ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 3 నుంచి మే 18, 2017 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ప్రారంభ తేదీ: 03/05/2017
చివరి తేదీ: 18/05/2017

ఉద్యోగ ప్రకటన కోసం సంప్రదించండి: https://goo.gl/XEcVt8

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+