ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్: 121 పోస్టులకు అప్లై చేస్కోండి

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 121 ఉద్యోగాల్లో.. 16 మేనేజర్ పోస్టులు, 24 చీఫ్ మేనేజర్ పోస్టులు.. ఇంకా వివిధ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 16 జనవరి 2018 నుంచి 04 ఫిబ్రవరి 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్ట్ పేరు : మేనేజర్, చీఫ్ మేనేజర్
ఖాళీల సంఖ్య : 121
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా ఎక్కడైనా.
ఆఖరు తేదీ : 04 ఫిబ్రవరి 2018

వేతనం వివరాలు:
మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) : రూ.42,020 - రూ.51,490
చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) : రూ.50,030 - రూ.59,170

విద్యార్హతలు : మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. సీఏ లేదా పీజీడీఎం/ఎంబీఏ లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటు 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. సీఏ లేదా పీజీడీఎం/ఎంబీఏ లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటు 8 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

వయో పరిమితి: మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. అభ్యర్థి వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. అభ్యర్థి వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 16.01.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 04.02.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+