SBI: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. యూపీఐ పేమెంట్‍లో తిప్పలు తప్పవటా..!
గత మూడు రోజులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు యూపీఐ పేమెంట్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై చాలా మంది సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించారు. దీనిపై ఎస్బీఐ వివరణ ఇచ్చింది. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కార్యకలాపాల కారణంగా SBI UPI సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొవచ్చని ఎస్బీఐ ఎక్స్ లో పేర్కొంది. ఇందుకు సంబంధిచి ఓ నోట్ ను పోస్ట్ చేసింది.
"ప్రియమైన కస్టమర్‌లారా, మేము టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ను చేపట్టాము, దీని కారణంగా మీరు బ్యాంక్ UPI సేవలలో అడపాదడపా హెచ్చుతగ్గులను ఎదుర్కోవచ్చు. మీకు కలిగించే అసౌకర్యానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము. మేము త్వరలో అప్‌డేట్ అవుతుంది" అని ఎస్బీఐ పేర్కొంది. 3 రోజుల నుంచి సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్‌లలో ఒకరికి X లో SBI రిప్లే ఇచ్చింది.

"మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. సాంకేతికత అప్‌గ్రేడేషన్ కార్యకలాపాల కారణంగా మా UPI సేవలు అడపాదడపా హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. దయచేసి మళ్లీ ప్రయత్నించండి. ఏదైనా తదుపరి సహాయం కోసం మమ్మల్ని తిరిగి మార్చండి" అని వివరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఉంది.
— State Bank of India (@TheOfficialSBI) October 14, 2023
ఇంటర్నెట్ ద్వారా 117 మిలియన్లు, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వరసగా 64మిలియన్ల కస్టమర్లను కలిగి ఉంది.2023 ఆర్థిక సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్, లైఫ్ స్టైల్ ప్లాట్ ఫారమ్ YONO ద్వారా 63 శాతం కొత్త సేవింగ్స్ ఖాతాలు తెరిచారు. దేశంలోని ప్రజలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ఎక్కువగా వాడుతున్నారు. చాలా మంది ఎస్బీఐ కస్టమర్లు ఈ యూపీఐ యాప్ ల ద్వారా పేమెంట్ చేయడంలో విఫలమయ్యారు.












Click it and Unblock the Notifications