ఎస్‌బిఐ షాక్: ఖాతాల్లో కనీస నగదు లేకపోతే ఇక ఛార్జీల మోత
ఎస్‌బిఐ తన ఖాతాదారులకు షాక్ ఇస్తోంది. తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఫెనాల్టీ విధించనుంది.
Recommended Video

ముంబై:ఎస్‌బిఐ తన ఖాతాదారులకు షాక్ ఇస్తోంది. తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఫెనాల్టీ విధించనుంది. మెట్రో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఫెనాల్టీ విధించనుంది ఎస్‌బిఐ
తమ ఖాతాదారులకు సంబంధించి ఎస్‌బీఐ బ్యాంకు పెనాల్టీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్లలో కనీస మొత్తాన్ని నిల్వ ఉంచాలని గతంలో సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెట్రో నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఖాతాదారులు ఎంతెంత మొత్తాన్ని నిల్వ ఉంచాలో కూడా గతంలో ఎస్‌బీఐ ప్రకటించింది.

కనీస మొత్తాన్ని నిల్వ ఉంచని ఖాతాదారులకు పెనాల్టీ విధిస్తామని కూడా హెచ్చరించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో ఇక జరిమానా విధించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.
జీఎస్టీ 18శాతం కలుపుకుని ఈ పెనాల్టీని ఎస్‌బీఐ విధించనుంది. దశలవారీగా, బ్రాంచీల వారీగా ఈ పెనాల్టీని విధించనుంది. ఈ పెనాల్టీ మొత్తం 100 రూపాయలకు పైగానే ఉండబోతోంది. ఈమేరకు కనీస మొత్తం నిర్వహించని ఖాతాలపై లెవీ చార్జీలు విధించేందుకు ఆర్బీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఎస్‌బీఐ దూకుడు పెంచింది. అయితే ఈ పెనాల్టీ మెట్రో నగరాల్లో ఒక విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో విధంగా ఉండనుంది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ సమాచారం
మెట్రో నగరాల్లోని ఎస్‌బిఐ ఖాతాధారులు తమ ఖాతాల్లో కనీసం రూ. 5 వేల నగదునల్వ ఉంచుకోవాల్సిందే. సెమీ అర్భన్ ప్రాంతాల్లో రూ.3వేలు, అర్బన్ ప్రాంతాల్లో రూ2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి రూపాయాలను కనీస నగదు నిల్వలను ఉండేలా చూడాలి. లేకపోతే ఫెనాల్టీ వేయనున్నట్టు ఎస్‌బిఐ ప్రకటించింది.












Click it and Unblock the Notifications