Same sex marriage: తేల్చేసిన సుప్రీంకోర్టు: బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు: వ్యతిరేకించింది వీరే

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పలు పిటీషన్లు దాఖలయ్యాయి.

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇదివరకే విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించింది.

SC declines to legalese Same sex marriage

ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు క్రోడీకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ అరుంధతీ కట్జూ తన వాదనలను వినిపించారు. హైకోర్టుల్లో పెండింగ్‌ లో ఉన్న స్వలింగ వివాహాల గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.

జనవరి 6వ తేదీన వాటన్నింటినీ తమకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకుండా గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులను జారీ చేసింది. స్వలింగ సంపర్కులు లేదా భిన్న లింగ సంపర్కులు పరస్పర అంగీకారంతో సెక్స్ చేయడం నేరం కాదని పేర్కొంది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. దీనికి చట్టబద్ధతను కల్పించడం, అధికారికంగా గుర్తింపును ఇవ్వడం సరికాదని తేల్చి చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం- స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది.

స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది. భిన్న లింగ వివాహానికి మాత్రమే గుర్తింపు ఉందని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పిటీషన్లపై విచారణను అయిదు మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఆయా పిటీషన్లపై విచారణను మే 11వ తేదీన ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి కిందటే తన తీర్పును వెలువడించింది ఈ అయిదుమంది న్యాయమూర్తుల బెంచ్.

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించట్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహానికి దేశంలో అనుమతి లేదని తుది తీర్పు వినిపించింది. చట్టబద్ధతను కల్పించడానికి నిరాకరిస్తున్నట్లు వివరించింది. ఈ తీర్పు పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.

అయిదుమందిలో ముగ్గరు న్యాయమూర్తులు చట్టబద్ధత కల్పించడానికి నిరాకరించారు. ఇద్దరు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. చట్టబద్ధత కల్పించడానికి సానుకూలత వ్యక్తం చేయగా.. జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ దీన్ని వ్యతిరేకించారు.

ఈ తీర్పును సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిష్ అగర్వాల్ స్వాగతించారు. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతి లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. తీర్పు పాఠాన్ని చదివి వినిపించారు. న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ అనేవి పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకే ఉన్నాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+