కరోనాకు మందు కనిపెట్టా! : ఆయుర్వేద వైద్యుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం, జరిమానా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వారి భయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు, ఇతర వ్యక్తులు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. కరోనానా నయం చేస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలాంటి ఓ వైద్యుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానాను కూడా విధించింది.

కరోనాకు మందు కనిపెట్టానంటూ..

కరోనాకు మందు కనిపెట్టానంటూ..

కరోనావైరస్‌కు తాను మందు కనిపెట్టానని, తాను తయారు చేసిన మందులను వినియోగించేలా తీర్పు ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన సదరు ఆయుర్వేద వైద్యుడిపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనాధారిత పిటిషన్ వేసిన అతడికి రూ. 10వేల జరిమానా కూడా విధించింది. ఆయుర్వేద వైద్యంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన హర్యానాకు చెందిన ఓ ప్రకాశ్ వేద్ జ్ఞాన్‌తారా అనే ఈ వ్యక్తి.. తాను కరోనాకు మందు తయారు చేశానని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాడు.

తన కరోనా మందును వాడేలా తీర్పు ఇవ్వాలంటూ..

తన కరోనా మందును వాడేలా తీర్పు ఇవ్వాలంటూ..

అంతేగాక, భారత ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, ఇతరులు తాను తయారు చేసిన మందును వినియోగించేలా తీర్పు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాడు. తాను రూపొందించిన ఈ మందు ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడుతుందని తెలిపాడు.

ఎలాంటి ఆధారాలు లేకపోవడంపై సుప్రీం ఆగ్రహం

ఎలాంటి ఆధారాలు లేకపోవడంపై సుప్రీం ఆగ్రహం

అయితే, అతను తయారు చేసిన మందును ఎక్కడా ఏ ప్రభుత్వమూ కానీ, సంబంధిత సంస్థలు కానీ ధృవీకరించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈ తరహా పిల్‌ను వేయడాన్ని జస్టిస్ సంజయ్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.

Recommended Video

    Sushant Singh Rajput : Why Rhea Chakraborty Hired A Big Lawyer Within A Day ? - Kangana Ranaut
    కోర్టు విలువైన సమయం వృథా చేశారంటూ..

    కోర్టు విలువైన సమయం వృథా చేశారంటూ..

    అనాధారిత పిటిషన్లు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ప్రచారం కోసమే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడింది. విలువైన న్యాయస్థానం సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. సదరు వైద్యుడి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. రూ. 10వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోనే జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+