సోషల్ మీడియా వేదికగా దాడులా? కట్డడి చేయాల్సిందే: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేపీ పర్దీవాలా
న్యూఢిల్లీ: న్యాయమూర్తులు, వారి తీర్పులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దాడులకు ప్రయత్నించడం ప్రమాదకరమైన పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రక్షించుకోవాలంటే డిజిటల్, సోషల్ మీడియాలను తప్పనిసరిగా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
సోషల్ మీడియా వేదికలపై లక్ష్మణరేఖ దాటుతూ న్యామూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా, దురుద్దేశంతో దాడులకు పాల్పడటం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పర్దీవాలా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ పార్దివాలా తన ప్రసంగంలో.. "న్యాయమూర్తులపై వారి తీర్పుల కోసం వ్యక్తిగత దాడులు ప్రమాదకరమైన దృష్టాంతానికి దారితీస్తాయి, ఇక్కడ న్యాయమూర్తులు చట్టం ఏమనుకుంటుందో కాకుండా మీడియా ఏమనుకుంటుందో ఆలోచించాల్సిన ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది. ఇది న్యాయవ్యవస్థకు హాని కలిగిస్తుంది. సామాజిక, డిజిటల్ మీడియా ప్రాథమికంగా న్యాయమూర్తులపై నిర్మాణాత్మకమైన విమర్శనాత్మక మూల్యాంకనానికి బదులుగా వ్యక్తిగతీకరించిన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఆశ్రయించడం న్యాయ వ్యవస్థకు హాని, దాని గౌరవాన్ని తగ్గిస్తుంది. తీర్పుల పరిష్కారం సోషల్ మీడియాతో లేదు. న్యాయమూర్తులు తమ నాలుక ద్వారా మాట్లాడరు, వారి తీర్పుల ద్వారా మాత్రమే. పూర్తిగా పరిణతి చెందిన లేదా నిర్వచించబడిన ప్రజాస్వామ్యంగా నిర్వచించలేని, పూర్తిగా చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను రాజకీయం చేయడానికి సోషల్ మీడియా తరచుగా ఉపయోగించబడుతోంది' అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధమైన పాలనను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా డిజిటల్, సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని జస్టిస్ జేపీ పార్దీవాలా అన్నారు. కాగా, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నుపుర్ శర్మ నోటి దురుసు కారణంగా దేశం తగలబడుతోందని మండిపడింది. ఈ నేపథ్యంలో మీడియా వేదికగా దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నుపుర్ శర్మ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications