రిలయన్స్‌కు షాక్.. డీల్ కుదరదన్న సుప్రీంకోర్టు: అమెజాన్‌కు అనుకూలంగా..!!

గత కొన్ని రోజులుగా మూడు పెద్ద కంపెనీల మధ్య జరుగుతున్న పోరు సుప్రీంకోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, రిలయన్స్ ఇంకా ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ మధ్య కాస్త వివాదం నెలకొంది. ఫ్యూచర్ రీటెయిల్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.24,731 కోట్లు మేరా విలువ చేసే ఆస్తులను రిలయన్స్ సంస్థలో కలిపేయాలన్న ఆలోచనను అమెజాన్ తప్పుబడుతూ తమకు న్యాయం చేయాల్సిందిగా సుప్రీంకోర్టు తలపులను తట్టింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం అమెజాన్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది ఫ్యూచర్ రీటైల్ సంస్థ.

అమెజాన్ - రిలయన్స్

అమెజాన్ - రిలయన్స్

ఫ్యూచర్ రీటైల్ ఆస్తులు రిలయన్స్‌లో విలీనం అవ్వడాన్ని తప్పుబడుతూ అమెజాన్ సంస్థ సింగపూర్‌ కోర్టును మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా గతంలో కోరింది. అయితే అమెజాన్ సంస్థ చెబుతున్నట్లుగా ఫ్యూచర్ రీటైల్ సంస్థతో పార్ట్‌నర్‌గా ఉంటూ మరో సంస్థలో ఆస్తులు విలీనం చేయడమనేది సరికాదని వెల్లడించింది. అయితే సింగపూర్ మధ్యవర్తిత్వాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్న ధర్మాసనం అమెజాన్ సంస్థ పిటిషన్‌లో తమకు ఎలాంటి తప్పులు కనిపించడం లేదని పేర్కొంటూ ఆ సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.

 సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమెజాన్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమెజాన్

అమెజాన్ మరియు ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్‌ సంస్థలు తాము కుదుర్చుకున్న ఒప్పందంపై న్యాయపోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈఏ అవార్డు చెల్లుబాటులో ఉంటుందని అదే సమయంలో దాన్ని అమలు చేసే వెసులుబాటు కల్పించాలని కోరుతూ అమెరికా సంస్థ అయిన అమెజాన్ సుప్రీంకోర్టును తన పిటిషన్‌లో పేర్కొంది. దీన్ని విచారణ చేసిన సుప్రీంకోర్టు ఇలా పేర్కొంది. "ముందుగా ఈఏ అవార్డు సెక్షన్ 17(1) కిందక వస్తుందా అనేది పరిశీలిస్తాం. (ఈఏ అవార్డు అనేది మధ్యవర్తిత్వం వహించిన ట్రైబ్యునల్‌కు సంబంధించినది). ఒకవేళ మా పరిశీలనలో సరైనదే అని తేలితే ఆ తర్వాత సెక్షన్ 17(2) కింద అమలు చేయొచ్చా లేదా అనేది పరిశీలిస్తాం" అని ధర్మాసనం వెల్లడించింది.

 ఆర్బిట్రరీ కన్సీలియేషన్ చట్టంలో ఏముంది..?

ఆర్బిట్రరీ కన్సీలియేషన్ చట్టంలో ఏముంది..?

ఇక ఆర్బిట్రరీ కన్సీలియేషన్ చట్టంలోని సెక్షన్ 17(1)లో ఇలా ఉంది. " ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఇరు పార్టీల అంగీకారం మేరకు కోర్టు మధ్యవర్తిత్వం వహిస్తుంది. వివాదం పై పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఎక్కడైనా నష్టం వాటిల్లుతుందని భావిస్తే మధ్యవర్తిగా ఉన్న కోర్టు నష్టనివారణ చర్యల్లో భాగంగా ఒక పార్టీకి ఆదేశాలు ఇచ్చే వీలుంది." అంతకుముందు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను కూడా ఫ్యూచర్ రీటెయిల్ లిమిటెడ్ మరియు రిలయన్స్ మధ్య విలీనం కేసుపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని జూలై 20వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో నష్టం

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో నష్టం

అంతకుముందు అమెజాన్‌కు షాకిస్తూ డీల్‌తో ముందుకు సాగొచ్చని ఢిల్లీ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బ్రేక్ ఇవ్వాలని తమ పిటిషన్‌లో కోరింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ సంస్థ భారత్‌లో 6.5 బిలియన్ డాలర్ల మేరా పెట్టుబడులు పెట్టాలని భావించిందని.. ఈ ఆదేశాలతో తీవ్ర నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరింది. 2019లో అమెజాన్-ఫ్యూచర్‌ రీటైల్ లిమిటెడ్ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్‌ తమ ఆస్తులను ఎవరికీ అమ్మరాదని ఒప్పందంలో స్పష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ ఆస్తులు ముఖేష్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్‌లో విలీనం చేయరాదంటూ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మరోసారి అమెజాన్ - రిలయన్స్ సంస్థల మధ్య బిజినెస్ వార్‌ ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+