అందులో ఏముందో చదివారా?: ఎస్సీ, ఎస్టీ చట్టం తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నో
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించింది. చట్టానికి తాము వ్యతిరేకం కాదని చెప్పింది. కానీ అమాయకులకు శిక్షపడరాదనేది తమ అభిమతమని పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటోందని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆందోళనల వెనుక రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నాయని పేర్కొంది. అసలు ఆందోళనలు చేస్తున్న వారు మా తీర్పు చదివారా అని ప్రశ్నించింది.

ఎస్సీ, ఎస్టీ చట్టంపైగత నెల 20న ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు తిరస్కరించింది. తాము మార్చి 20న ఇచ్చిన తీర్పును ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వర్గాలు కనీసం చదివినట్లు కూడా కనిపించడం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో స్వార్థపూరిత శక్తులు కూడా జోక్యం చేసుకుంటున్నాయన్నారు.
అమాయకులను జైలుకు పంపించడం సరికాదని, ఈ చట్టం పట్ల తమకు వ్యతిరేకత లేదన్నారు. ఫిర్యాదును సరిచూడకుండా అరెస్టు చేయబడాలని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటోందన్నారు. ఇతర నేరాలు కూడా ఉన్నప్పుడు ప్రాథమిక దర్యాఫ్తుని నిర్వహించవలసిన అవసరం లేదని చెప్పింది. తదుపరి విచారణ పది రోజుల్లో జరుగుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications