నిత్యానందకు ఊరట, కొత్తపల్లి గీత కేసులో వ్యక్తి అరెస్ట్

నిత్యానంద స్వామి ఆగస్టు ఆరవ తేదీన పురుషత్వ పరీక్షలకు హాజరు కావాలని కర్నాటక హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర కోర్టు ఆదేశించింది. దీనిపై స్టే విధించాలని నిత్యానంద హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురయింది. దీంతో అతను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో నిత్యానందకు తాత్కాలిక ఊరట లభించింది.
కాగా, సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు.
దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో, నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
కొత్తపల్లి గీత కేసులో అరెస్ట్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పైన పేస్‌బుక్‌లో అసభ్య కామెంట్లు పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒకరి పేరు కిరణ్ అని తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications