ఇంట్లోనే 10 ఏళ్ల నుంచి అబార్షన్లు, లింగ నిర్దారణ
చెన్నై: గుట్టు చప్పుడు కాకుండా గత 10 సంవత్సరాల నుంచి లింగ నిర్దారణలు చేస్తూ అబార్షన్లు చేస్తున్న మహిళను తమిళనాడులోని తిరువణ్ణామలై పోలీసులు అరెస్టు చేశారు. తిరువణ్ణామలైలో నివాసం ఉంటున్న తిలగవతి ఆనంది అలియాస్ తిలగవతి (48) అనే మహిళను అరెస్టు చేశారు.
తిలగవతి ఆనంది ల్యాబ్ టెక్నీషియన్. ఈమె ఇంట్లో స్కానింగ్ యంత్రం పెట్టుకుంది. గత 10 సంవత్సరాల నుంచి లింగ నిర్దారణలు చేస్తున్నది. కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలుసుకున్న మహిళలు అబార్షన్లు చేయించుకోవడానికి సిద్దం అయ్యారు.
అలాంటి మహిళలు తిలగవతి ఇంటికి వెళ్లి అబార్షన్ల చేయించుకుంటున్నారు. ఈ విషయం వైద్య సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ గురునాథన్ కు తెలిసింది. వెంటనే అసిస్టెంట్ కమిషనర్ నరసింహన్, సూపరింటెండెంట్ కమలకన్నన్ తో కలసి తిరువణ్ణామలై చేరుకున్నారు.

తిరువణ్ణామలై ఆరోగ్య శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్, స్థానిక పోలీసులను వెంట పెట్టుకుని అవుల్ పురంలోని తిలగవతి ఆనంది ఇంటికి వెళ్లారు. అక్కడ కొందరు మహిళలు ఉన్నారు.వారిని విచారించగా తాము అబార్షన్ చేయించుకోవడానికి వచ్చామని అధికారులకు చెప్పారు.
ఇంటిలో పరిశీలించగా ఓ స్కానింగ్ యంత్రం, అబార్షన్ చెయ్యడానికి ఉపయోగిస్తున్న ఇంజక్షన్స్, మాత్రలు బయటపడ్డాయని, తిలగవతిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. గత 10 ఏళ్లుగా ఈ తతంగం జరుగుతుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications