విద్యార్థికి అసభ్య మెసేజ్‌లు: ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు

School alerts cops over lewd SMS teacher sent boy
ముంబై: ఓ పాఠశాల మాజీ విద్యార్థికి అదే పాఠశాలలో పని చేస్తున్న పిటి టీచర్‌ అసభ్యకర సందేశాలు పంపడం తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని ముంబైలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు అసభ్య సందేశాలు రావడంతో బాధిత యువకుడు పాఠశాల యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో నిందిత ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకునేందుకు స్కూల్ యాజమాన్యం సిద్ధమైంది.

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మాజ్‌గాన్ ప్రాంతంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఓ విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసి పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ స్కూల్ పిటి టీచర్‌, అతను తరచూ మెసేజ్‌లు పంపుకుంటూ టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే టీచర్ తాజాగా ఓ అసభ్యకర సందేశాన్ని ఆ విద్యార్థికి పంపించింది. ఈ విషయాన్ని విద్యార్థి స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు.

దీంతో స్కూల్ యాజమాన్యం ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని భావించింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్కూల్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది.

అసభ్య సందేశాల విషయంపై తమకు స్కూల్ నుంచి ఓ లేఖ అందిందని పోలీసులు తెలిపారు. కాగా, తాము నిందిత టీచర్‌కు ఈ విషయంపై మెమో జారీ చేసినట్లు, ఆమెకు అందే ఇంక్రిమెంట్‌ను నిలిపేస్తున్నట్లు స్కూల్ ఛైర్మన్ పింటో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+