చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీచర్ల ముందే: స్కూల్లో విద్యార్థుల అశ్లీల నృత్యాలు.. ఆ సంస్థ సీరియస్!

అరియలూరు జిల్లా జయంకొండాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అశ్లీల నృత్యాలు చేశారు. అశ్లీల భంగిమల్లో వారు డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అశ్లీల నృత్యాలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అశ్లీల భంగిమల్లో వారు డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

తమిళ్ బండిట్ అనే చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు విద్యార్థులు డ్యాన్స్ చేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. డ్యాన్స్ లో భాగంగా..కొంతమంది విద్యార్థులు బొమ్మ తుపాకులు చేత్తో పట్టుకుని చుట్టూ నిలుచున్నారు. ఒక విద్యార్థి స్త్రీ వేషంలో కింద పడుకుని ఉండగా.. మరో విద్యార్థి అతనిపై పడినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

school students ugly dance in tamilnadu

సోషల్ మీడియాల్ వైరల్ అయిన ఈ వీడియో బాలల హక్కుల పర్యవేక్షణ సంస్థ దృష్టికి కూడా వెళ్లింది. దీనిని లైంగిక ప్రేరేపిత చర్యగా పరిగణించిన బాలల హక్కుల సంస్థ లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసింది.

విద్యార్థుల అశ్లీల నృత్యాలను అక్కడే ఉన్న టీచర్లు అడ్డుకోకపోవడాన్ని కూడా ఆ సంస్థ తప్పుపట్టింది. వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నట్లు ప్రకటించింది.

English summary
Ariyaluru govt school students practiced a ugly dance infront of teachers, Child rights organization taken it very seriously
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X