School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు

బ్రిక్స్ సదస్సు- 2026 కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధం అయింది. దేశ రాజధాని దిల్లీలో ప్రగతి మైదాన్‌ లోని భారత్‌ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 12 నుంచి 13 వరకు జరగనున్న ఈ సమ్మిట్ లో సభ్య దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ఆహ్వానితులు, విదేశీ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల అధినేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు, అధికారులు అప్రమత్తం అయ్యారు. దేశ రాజధాని దిల్లీ నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 15 వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. 200 పారామిలటరీ కంపెనీలను మోహరించారు.

అయితే బ్రిక్స్ సమావేశం నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 11 న నగరంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యూకేషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహకార, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయనున్నారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలలకు ఫోన్ చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు.

Schools in Delhi to remain closed on September 11 due to the 18th BRICS summit in delhi latest news

అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్స్ తో పాటు పలు కార్యాలయాలు కూడా మూతపడనున్నాయి. ట్రాఫిక్ రద్దీని నియంత్రించే పనిలో భాగంగా దిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక సెప్టెంబర్ 11 న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లోనూ వీకెండ్ కావడంతో ఉద్యోగులు లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇక అటు విద్యార్థులు కూడా లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేయొచ్చు. శుక్రవారం ఇప్పటికే సెలవు ప్రకటించగా.. ఆ తర్వాత రెండో శనివారం కావడంతో చాలా చోట్ల పాఠశాలలు మూసివేస్తారు. ఇక ఆదివారం ఎలాగో సెలవు.. ఆ తర్వాత సోమవారం సెప్టెంబర్ 14 వినాయక చవితి కారణంగా ప్రభుత్వ సెలవు ఉంటుంది. దాంతో విద్యార్థులకు ఏకంగా నాలుగు రోజులు సెలవులు లభించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+